మంగళం శ్రీ
గురుభీమలింగునికి జయమంగళం నిత్యశుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం
తన్ను నమ్మి
కొల్చు భక్తుల చింతలన్నియు బాపి కాపాడు చిద్రూపుండైన శ్రీ గురుభీమలింగునికి
||జయమంగళం|| ||జయమంగళం||
మూఢులకు ముదముతో ముక్తి
త్రోవను జూపి కరుణతో కాపాడు కారుణ్యమూర్తికి
||జయమంగళం|| ||జయమంగళం||
కోటి సూర్యుల
కాంతి మేటివై వెలిగేటి ఏకమైవున్నట్టి పరమాత్మునికి
||జయమంగళం|| ||జయమంగళం||
వట్టిమ్రానుకు
చిగురు పుట్టింప గిట్టింప బిరుద వేములవాడ శ్రీ భీమలింగునికి
||జయమంగళం|| ||జయమంగళం||
తన్ను నెరనమ్మి
కొల్చు భక్తుల కొంగు బంగారమైనట్టి వర భీమలింగునికి
||జయమంగళం|| ||జయమంగళం||
సంచిత కర్మబాపి
సిరిసంపదలిచ్చు వైభవలింగునకు
||జయమంగళం|| ||జయమంగళం||
గడియాద్రిపురనివాసియై
దాసులను బోచేటి దాతయైనట్టి శ్రీ గురు సార్వభౌమునకు
||జయమంగళం||
||జయమంగళం||
శ్రీ భీమలింగేస్వర మంగళ శ్లోకములు
మంగళం భీమలింగాయా
మహనీయ గుణాత్మనే!
గడియాద్రి
నివాసాయ కరుణాలయా దయామయా !!
సద్గురు! భీమలింగాయా సర్వాభీష్ట ప్రదాయినే!
సర్వ చైతన్య
రూపాయా సాధురూపాయ మంగళం!!
మద్గురూ
భీమలింగాయా సర్వశేఖరా ధీవరా!
సర్వదా పాహి మాం పాహి
సత్య ధర్మ స్వరూపిణే!!
No comments:
Post a Comment