Friday 24 July 2020

నన్నెచోళదేవుడు-భీమకవి


భీమకవి నన్నెచోళదేవుడు రచించిన కుమార సంభవమును తిలకించి అతని గురించి ఈ క్రింది పద్యములను చెప్పారు.
      రవికుల శేఖరుడు; కవిరాజశిఖామణి; కావ్యకర్త; స
        త్కవి; భువినన్నుచోడుఁడటె! కావ్యము దివ్యకథఁగుమార సం
        భవమటె! సత్కధాధిపతిభవ్యుడు జంగమమల్లికారు నుం
        డవిచలితార్థయోగధరుఁడటె! వినంగొనియాడఁజాలదే
      కలుపొన్నవిరులు పెరుగన్
        గలుకోడిరవంబు దిశలఁగలయఁగఁజెలఁగఁ
        బొలుచునొరయూరికధిపతి
        యలఘుపరాక్రముడు టెంకణాదిత్యుడిలన్
సీ      కుతలంబునిడుకొనఁ గొలకొండగానిల్పి
                        శిరనిధిజొచ్చిరి నగరసుతులు
        మిన్నులపైఁబాఱుచున్న యేరిలదెచ్చి
                        వారాశినించె భగీరధుండు
        గోత్రాచలములెత్తికొని వచ్చి కడచన్న
                        రత్నాకరముఁగట్టె రాఘవుండు
        జలధిమహీనతి మొలమాలుగాఁ జుట్టి
                        పాలించెగరిగరికాలజోడు
        వరుసనిట్లు సూర్యవంశాధిపతులందు
        నిధియ మేరగాగ నిఖిలజగము
        నేలిచనిన వారికెనవచ్చు సుశ్లాఘ
        ధనుడు నన్నెచోళ జనవిభుండు

        తాను వ్రాసిన కుమారసంభవము భీమకవిచే ప్రశంసలందుకోవడం చూడగానే, నన్నెచోళదేవుడు మహదానందుడై భీమకవికి కనకాభిషేకము చేసి విస్తారముగా డబ్బునిచ్చి సత్కరించెను. భీమకవి ఇలా రాజుల నుంచి గ్రహించిన బహుమతులను, ద్రవ్యమును లోకకళ్యాణార్థము యజ్ఞయాగాది క్రతువులను జరిపించుటకు, పేదలకు దానం చేయుటకు వినియోగించేవారు.

No comments:

Post a Comment

భీమలింగేశ్వర స్వామి వరప్రసాది - గడేకల్ బొబ్బిలి నాగిరెడ్డి

బొబ్బిలి నాగిరెడ్డి గడేకల్ భీమలింగేశ్వర స్వామి వరప్రసాది అని ప్రతీతి. ఈయన భీమలింగేశ్వర స్వామికి చేసిన సేవకి పూజకి స్వామి సంతోషించి పిలిస్తే ...