Saturday 25 July 2020

2. అంబమ్మ మఠంలో నిత్యపూజలతో మహిమాన్వితమైన దైవంగా వెలుగోందుతున్న శ్రీ భీమలింగేశ్వరస్వామి



అంబమ్మ మఠంలో నిత్యపూజలతో మహిమాన్వితమైన దైవంగా వెలుగోందుతున్న శ్రీ భీమలింగేశ్వరస్వామి వారు.




కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ జిల్లా, సింధనూరు తాలుక, తుంగబద్ర నదీ తీరాన గల శ్రీ అంబాదేవి మఠం వద్ద కూడా కొంతకాలము నివసించారు. ఇక్కడ స్వామి వారికి ఒక దేవాలయము కూడా నిర్మించారు.  అక్కడి ప్రజలు భీమలింగేశ్వరుడు ధ్యాననిమగ్నుడై కుర్చునే చోటు, భక్తులకు తన భోదనలు అందించే చోటున దేవాలయాన్ని నిర్మించి ఒక లింగాన్ని ప్రతిష్టించి శ్రీ భీమలింగేశ్వరస్వామిగా కొలుస్తున్నారు. ఇప్పటికీ ఆ దేవాలయంలో స్వామివారికి నిత్యపూజలు జరుగుతున్నాయి. లింగాయితులు ఆ దేవాలయానికి పూజాదివ్యవహారాలను చూసుకుంటున్నారు. ఈ ప్రాంతమున భీమలింగేశ్వరస్వామికి సంబంధించి ఒక కథ ప్రచారంలో ఉంది. భీమలింగేశ్వరస్వామి దేవాలయమును దర్శించినపుడు అక్కడివారు కొందరు స్వామి గురించి ఈవిధముగా చెప్పారు. అంబమ్మ దేవాలయంలో తిరునాళ్ళు జరుగుతున్న రోజుల్లో స్వామివారు అక్కడకు వచ్చారు. ఈ తిరునాళ్ళు ప్రతి ఏటా పుష్యమాసపౌర్ణమినాడు ఎంతో వైభవంగా జరుగుతాయి.
అంబమ్మ ఉత్సవాన్ని పురస్కరించుకుని పండితులు కొందరు పురాణకథలూ, ఉపన్యాసాలు, జ్ఞానభోదనలు చేస్తున్నారు. ఆ సమయంలో స్వామి వారు అక్కడే ఉన్నారు. అక్కడ చెబుతున్న పండితులలో కొంతమందికి పురాణాల పట్ల, శాస్త్రము పట్ల మరియు సంస్కృతభాషా పట్ల సరైన అవగాహన లేక కల్పిత కథలు చెబుతూ..పైగా మేము వైధిక శాస్త్రలలో నిశ్ణాతులమని పండితులలో కొందరు చెప్పుకుంటూ అసత్యబోధనలు చేస్తున్నారు. ఆధ్యాత్మిక సందేహాలకు సమాధానాలుగా కల్లబొల్లి మాటలను చెబుతున్నారు. ఇది  స్వామి వారికి నచ్చలేదు. స్వామివారు వారి బోధనలను తప్పు పట్టారు. వారిని ప్రశ్నించారు. నలుగురినీ ఇలా తప్పుదోవ పట్టించవద్దని హితువు పలికాడు.
అసత్యభోధనలు చేస్తున్న పండితులకు, తోడుగా అక్కడే ఉన్న మిగతా పండితులంతా జతకలిసి గుంపుగా చేరి ఈ ముసలతను ఇక్కడే ఉంటే తమ ఉనికికే ప్రమాదమని భయపడ్డారు. మరుసటి రోజు ఉదయం వారు స్వామిని పిలిచి “ఎవరవు నువ్వు? ఎక్కడినుంచి వచ్చావు?” అని అడిగారు. “నేను దక్షారామభీమేశ్వరుని వరపుత్రుడను వేములవాడ భీమలింగేశ్వరుడను“ అని బదులిచ్చారు. ఏదో విధంగా అతన్ని ఇక్కడి నుంచీ పంపివేయాలన్న ఉద్దేశంతో పండితులంతా కలిసి “మేము మీకు ఒక పరీక్ష పెట్టదలచాము. అందులో నెగ్గితేనే నీకు ఇక్కడ స్థానము, ఓడిపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. మీకు సమ్మతమేనా?” అని అడిగారు. స్వామివారు “అందుకు నాకు సమ్మతమే. కానీ నేను నెగ్గిన తరువాత మీ అందరికీ కూడా ఒక పరీక్ష పెడతాను అందులో నెగ్గితేనే మీకు ఇక్కడ స్థానం” అని షరతు పెట్టారు.

                మరుసటిరోజు జనులందరి మధ్య వారు తమ శక్తిని ప్రదర్శించి స్వామివారు తన పాండిత్యప్రకర్శణాన్ని పరీక్షించారు. సకలశాస్త్రపారంగతుడైన స్వామి సునాయాసంగా నెగ్గాడు. ఇప్పుడు స్వామి వారి వంతు. స్వామి అందరినీ అక్కడ ఉన్న బావి దగ్గరకు పిలిచి ప్రజలతో కొన్ని చిన్న చిన్న రాళ్ళను తెప్పించారు. తనతోపాటు పండితులకు ఒక్కొక్క రాయిని ఇవ్వమని చెప్పారు. అందరి సమక్షంలో చూపించి వారివారి రాళ్ళకు గుర్తులు పెట్టి, అందరికీ చూపుతూ ఆ రాయిని ఒక్కొక్కరుగా ఈ బావిలోకి వేసెదము. ఎవరి రాయి అయితే నీటిపై తేలుతుందో వారికి మాత్రమే ఇక్కడ స్థానమని చెప్పారు. అక్కడి ప్రజలు, పెద్దలు అందుకు సమ్మతించిపై చెప్పిన ప్రకారము జరిపించారు. అలా బావిలో వేసిన రాళ్ళలో స్వామివారు వేసిన రాయి మాత్రము నీటిపై తేలినది. ఈ సంఘటన చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇతడు సాధారణ మానవుడు కాదని కొనియాడారు. ఆ ఊరివారు రోజు స్వామివారిని దర్శించేవారు, తమ తమ కష్టాలను స్వామివారితో విన్నవించుకొనేవారు. వారి సమస్యలకు పరిష్కారాలు దొరికేవి. స్వామివారిని ఇలవేలుపుగా, ప్రత్యక్షదైవంగా కొలిచేవారు. స్వామివారు ధ్యానంలో కుర్చొనేచోట ఒక దేవాలయమును నిర్మించారు. ఈ దేవాలయానికి తూర్పుముఖాన ఒక కిలోమీటరు దూరాన కొండను అనుకొని శ్రీబాగళాంబదేవి ఆలయము ఉన్నది. పడమర వైపున తుంగభద్రనది ఉన్నది.

No comments:

Post a Comment

భీమలింగేశ్వర స్వామి వరప్రసాది - గడేకల్ బొబ్బిలి నాగిరెడ్డి

బొబ్బిలి నాగిరెడ్డి గడేకల్ భీమలింగేశ్వర స్వామి వరప్రసాది అని ప్రతీతి. ఈయన భీమలింగేశ్వర స్వామికి చేసిన సేవకి పూజకి స్వామి సంతోషించి పిలిస్తే ...