Friday 24 July 2020

పావులూరి మల్లన- భీమకవికి


పావులూరి మల్లన భీమకవికి సమకాలికుడు. ఇతను శివ్వన్నఅను అతనికి కుమారుడు. భీమకవి సవతి తల్లులలో ఒకామెకి ఈ శివ్వన్న తోబుట్టువని మలయమారుత కవీంద్రునిచే రచించబడిన “నీతి శాస్త్రము”లో వ్రాయబడింది.పావులూరి మల్లన గణితశాస్త్రములో మిక్కిలి పండితుడు. “పావులూరి గణితము” అనే పేరుతో గణితశాస్త్రమున ఒక పుస్తకం రచించాడు. పావులూరు మల్లనకు రాజరాజనరేంద్రుడు నవఖండవాడ అనే గ్రామమును దానము చేశాడు. పిఠాపురములోని కుక్కుటేశ్వరస్వామి వారి ఆలయాము నందు ఈ దానశాసనం లభించింది.ఈ దానశాసనమును భీమకవి రచించారు. ఈశాసనం చివరిభాగమున “ఇతి వేములవాడ భీమకవికృతమ్ “ అని ఉన్నది. ఈ పావులూరి మల్లనపై వేములవాడ భీమకవి రచించిన పద్యమాలిక

        సీ      ఆందోళికంబునం దతిరహస్యంబుగాఁ
                        జాపఱాయిని బెట్టఁజాటినావు
                జలనిధిలోతు లెక్కలచేతగన్గొని
                        యద్దఱిద్దఱియొడ్ల కరిగినావు
                మూసినబండిలో మునిగియుండెనని తెల్పి
                        ఱేనికిఁగోపంబు ఱేచినావు
                గాలిచేనల్లాడు కాగడాచుట్టలో
                        గద్యాణములమూటఁ గాంచినావుఁ
                గణితశాస్త్రంబురచియింపఁ గల్గినావు
                పతిని మెప్పించి గ్రామముల్వడసినావు
                తలఁవనీసాటి మంత్రులిద్ధరనుగలరె?
                మహితగుణవార! శివ్వన మల్లధీర.

No comments:

Post a Comment

భీమలింగేశ్వర స్వామి వరప్రసాది - గడేకల్ బొబ్బిలి నాగిరెడ్డి

బొబ్బిలి నాగిరెడ్డి గడేకల్ భీమలింగేశ్వర స్వామి వరప్రసాది అని ప్రతీతి. ఈయన భీమలింగేశ్వర స్వామికి చేసిన సేవకి పూజకి స్వామి సంతోషించి పిలిస్తే ...