Saturday 25 July 2020

శ్రావణమాసం విశిష్టత / విధులు..


పౌర్ణమి నాడు శ్రవణా నక్షత్రం ఉన్న నెలను మనము శ్రావణ మాసం అని జరుపుకుంటాము ఇది చాతుర్మాస్యము లో రెండో నెల ఎన్నో పండుగలు వ్రతాలు పూజలు వెంట తీసుకువచ్చే నెల. “ఈ నెలలో పరమ శివుని కి అఖండ అభిషేకము అఖండ బిల్వ అర్చన నిత్యము శివ నామ సంకీర్తన చేసే వారికి పరమేశ్వరుని అనుగ్రహము వల్ల అఖండ ఐశ్వర్య ప్రాప్తి జ్ఞానప్రాప్తి అంత్యమున శాశ్వత శివ సాయిజ్యము కలుగుతుంది, శ్రావణ సోమవార వ్రతము , శ్రావణ మంగళ వార వ్రతము, శ్రావణ శుక్రవార వ్రతము,శ్రావణ శనివార వ్రతము, నాగుల చవితి , పంచమి పూజ, షష్ఠి సుబ్రహ్మణ్య పూజ, ఏకాదశి ద్వాదశి తిధి లక్ష్మీ నారాయణ పూజ, పౌర్ణమి కి ముందు వచ్చు శుక్రవారం “వర మహా లక్ష్మీ దేవి వ్రతము” , శ్రావణ పౌర్ణమి నాడు వైదిక పండితులకు ఉపాకర్మ, హాయగ్రీవ స్వామి జయంతి, రక్షా బంధన (రాఖీ పండుగ) , శ్రావణ బహుళ అష్టమి కృష్ణాష్టమి ఇలా నెల మొత్తం వ్రతాలు పండుగలు పూజలు మనకు శాస్త్రము నిర్దేశించింది , వరలక్ష్మి వ్రతము గృహస్తులు ఉదయం చేస్తే యతి సన్యాసులు ,పీఠాధిపతులు రాత్రి చేస్తారు భేదం లేకుండా అందరూ చేసుకునే వ్రతము ల్లో ఇది ఒక్కటి చాతుర్మాస్య వ్రతము చేసుకునే పీఠాధిపతులకు ఈ నెల లో సుమంగలి స్త్రీలు ఇచ్చుకునే దానము వారికి ఉండు సౌభాగ్య దోషాలు తొలగించి దీర్ఘ సుమంగలిత్వ ప్రాప్తి అనుగ్రహిస్తుంది , ఇలా ఎన్నో పుణ్యకార్యాలకు నెలవు శ్రావణ మాసం ” ఏ వ్రతాలు చేసే శక్తి లేని వారు కనీసం శివారాధన చేసుకొన్న చాలు ఈశ్వరుడే ఐశ్వర్య ప్రదాత ఐశ్వర్య కారకుడు ” ఇట్లు శ్రీగురుచరణ దాసులు
శ్రీజగద్గురు శంకర దత్తత్రేయ మహాసంస్థాన మఠం , అనంతపురం

No comments:

Post a Comment

భీమలింగేశ్వర స్వామి వరప్రసాది - గడేకల్ బొబ్బిలి నాగిరెడ్డి

బొబ్బిలి నాగిరెడ్డి గడేకల్ భీమలింగేశ్వర స్వామి వరప్రసాది అని ప్రతీతి. ఈయన భీమలింగేశ్వర స్వామికి చేసిన సేవకి పూజకి స్వామి సంతోషించి పిలిస్తే ...