Friday 24 July 2020

భీమకవిని స్తుతించిన కవులు


·        శ్రీనాథుడు తన “కాశీఖండం”లో తన పూర్వపు కవులను స్తుతిస్తూ, మొదటగా భీమకవి ఉద్దండ శైలిని గుర్తుకుతెచ్చుకున్నాడు. 

                        “ వచియింతు వేములవాడ భీమన భంగిఁ
                        నుద్దండలీల నొక్కొక్క మాటు
                        భాషింతు నన్నయభట్టుమార్గంబున
                        నుభయభాషాప్రౌఢి నొక్కమాటు”

·        పట్టపు సరస్వతీ సోమయాజి (సాక్షాత్తు భీమేశ్వరుడు భీమకవి నాలుక చివర వాగ్భామిని బీజాక్షరాలను లిఖించాడని)

                        భీమేశ్వరు డితడు మా నామము వాడనుచు వ్రాసి
                        నాలుకతుద వాగ్భామిని బీజాక్షర మా భీమన
                        దలచినను గల వభీష్టఫలంబుల్ (పృథుచరితము)

·        తిరువేంగళ కవి తన “చొక్కనాథచరిత్ర” గ్రంథములో తెలుగు కవులను స్తుతిస్తూ భీమకవి ని తొలుత తలచి తరువాత కవిత్రయాన్ని తలచాడు.
                “ భవభూతి దండుమాఘునిని బిరుద వేములవాడ భీము,
                నన్నయ తిక్కన ఎఱ్ఱపార్య శ్రీనాథునిలఁగల్గు కవులను నెల్ల
                సద్భక్తి విలసిత సద్వాక్య వినుతి నుతించియెకతి రచియింప”

·        కొరవి గోపరాజు అను కవి భీమకవిని (బలభీముడు, వినుత భీముడు) గూర్చి 
                        “వేములవాడక సుఖియై
                        వేములవాడం జరించి వేములవాడన్
                        దా మెరసిన భీముని సుత
                        భీముని బలభీము విముఖతభీముదలంతున్”
·        ఆంధ్రకవి రామయ్య (భీమకవి ఛందోనిబంధన చాతురీ ధోరేయుడని, వాగ్ధాముడనీ)
“ఛందోనిబంధన చాతురీధోరేయు వాగ్దాము
వేములవాడ భీము”

                “చను నుత్తమగండాధ,ర్వణహనుమదనంతన కవిరాక్షనజయదే
                వనుత శ్రీధరగోక,ర్ణనీలకంఠాది భీమన చ్ఛందంబుల్”
               

·        వెల్లంకి తాతంభట్టు (భీమకవి లక్షణకర్త)

                        “భీమన అఖండంబు మొదలైన కొన్ని వళులకు
                        లక్షణ లక్ష్యంబులు చెప్పడు”
                        ప్రజ్ఞాలవదుర్విదగ్దు లసంగతంబుగా బెనచి
                        తగిలించినా; రతని యంకితంబు లేవున
                        వానిం బ్రమాణింపతగదు”

·        చంద్రరేఖావిలాప రచయిత కూచిమంచి జగ్గకవి (తిట్టు కవిత్వం అనగా అందులో భీమకవి అగ్రగణ్యుడని చెప్పాలని)
                భీమకవి రామలింగని
                స్త్రీ మన్మధుడై చెలఁగు శ్రీనాధకవిన్
                రాముకవి ముఖులను ర్రొ
                ద్ధామగతిఁ జిత్తువీధిఁదలచి కడంకన్

·        పెదపాటి సోమనాథుడు రచించిన అరుణాచలపురాణంలో భీమకవిని ఇలా తలచాడు.
వాక్ప్రతోషితదక్షవాటి మహాస్థాన
భీము వేములవాడ భీముఁగొలిచి

·        మొల్ల
స్తుతగుణోద్ధాము నాచనసోము భీముని

·        పింగళి సూరన్న భీమకవి రచించిన రాఘపాండవీయం అను రెండర్థముల కావ్యం దొరకకపోవడం వలన అలాంటి కావ్యమును అదే పేరున రచించాడు. ఆ గ్రంథములో మొదటి పద్యాన ఇదే విషయాన్ని  ఇలా వ్రాశాడు.

              భీమన తొల్లి చెప్పెనను పెద్దల మాటయె కాని యందునొం;
                 డేమియు నేయెడ న్నిలుచు         టెవ్వరు గాన రటుండనిమ్ము నా,
                 నామహిత ప్రబంధరచనా ఘనవిశ్రుతి నీకుఁ గల్గుటన్,
                నామదిఁ దద్ద్వయార్థకృతి నైపుణియుం గల దంచు నెంచెదన్

·        చిత్రకవి పెద్దన (భీమకవి ఈశ్వరప్రసాది కవితాడ్యుడని)
ప్రత్ర్యక్ష వర ప్రసాదకవితాడ్యుని
వేములవాడభీమునిన్

·        లింగముగుంట తిమ్మన
                భీమనయు ననంతయును బెద్దనయును
                తాతానయును జెప్పినట్టి ఛందములు గూర్చి
                ప్రకరణము లొప్పజేసెను బ్రహ్మసంఖ్య
                నొనర లింగముగుంట తిమ్మన యనుకవి

·        పొత్తపి వెంకట రమణ కవి
భీముని ఫణబంధపేశలంబు



·        వార్తకవి రాఘవయ్య
                “జనతతగణయుతము సంపత్కరంబుగా
                మంచి దనుచు భీము డెంచినాడు”
                “ఛందం మొదలనే వేములవాడ భీమ
                కవిగారి ప్రయోగం ఉన్నది”

·        కాకునూరి అప్పకవి
                “వికటకవులు కొన్ని వింతలు గల్పించి
                కవిజనాశ్రయమున గలిపినారు. వాని గఒకొనంగ
                వలదప్రయుక్తంబు లేల సెప్పు భీముడెరిగి యెరిగి”
                “ కవిజనాశ్రయమున
                ‘శ్రీకాంతా’ యని వేములవాడ భీమకవియును”
                “భీమన పది చెప్పె ననం
                తామాత్యుడు చెప్పె వెనుక యతు లిరువదినాల్గు”

·        ఓరుగంటి రామకవి
                భీమేశ్వర లబ్ధకవితావాచా సిద్ధిగల వేములవాడ
                భీమనార్యుం డొనరించిన కవిజనాశ్రయం
                బను ఛందంబు (కవితాలక్షణసారం)

·        కూచిమంచి తిమ్మకవి
భీమన చెప్పిన పదియతులను ప్రకారాంతమున వ్రాసుకోన్న పద్యమే ఉంది.

·        కస్తూరి రంగకవి
ఆదిమకవి భీమన రేచన మీద నంకితముగా జెప్పినాడు.

·        పిండిప్రోలు లక్ష్మణకవి
పృథు కుకవి స్వాంభీము భీము దలచి

·        కట్టమూర్తి కామేశ్వరకవి
రమణీయపాకాభీరాము భీము దలచి

·        శేషధర్మము లక్ష్మణకవిస్తుతి

భీము ననంతు జిత్రకవి పెద్దన సుధీంద్రు జగత్ప్రసిద్ధులన్

·        అనంతామాత్యుడు తన భోజరాజీయము అను కావ్యమునందు
        నన్నయభట్టుఁదిక్కనకవి నాచనసోముని భీమనార్యుఁ బే
        రెన్నిక జిమ్మపూడియమరేశ్వర భాస్కర శంభుదాసునిన్
        నన్నుతిఁజేసివాక్య సరసత్వము వీనులకింపు మీర న
        త్యున్నతిగా నొనర్తు నెఱ యోధులమేలనఁ గావుమిమ్ములన్

No comments:

Post a Comment

భీమలింగేశ్వర స్వామి వరప్రసాది - గడేకల్ బొబ్బిలి నాగిరెడ్డి

బొబ్బిలి నాగిరెడ్డి గడేకల్ భీమలింగేశ్వర స్వామి వరప్రసాది అని ప్రతీతి. ఈయన భీమలింగేశ్వర స్వామికి చేసిన సేవకి పూజకి స్వామి సంతోషించి పిలిస్తే ...