Friday 24 July 2020

భీమకవి బాల్యము


పిల్లాడికి నాలుగేళ్ళప్రాయం వచ్చింది. “అమ్మా” అని పిలువడం మొదలుపెట్టాడు. భీమేశ్వరుని వరపుత్రుడు కావున ఆ బాలున్ని భీమన్నా”, “భీమేశ్వరా”అని పిలుస్తూ మాచెమ్మ ఎంతో గారాభముగా పెంచసాగింది. భీమన్నకు నామకరణమహోత్సవంచేయడానికి ఎవరూ ముందుకురాలేదు. తప్పటడుగులు వేసే వయసు గడిచింది.
        ఊరి వారంతా భీమేశ్వరుని వరం వల్లపుట్టిన బాలుడీ భీమన్న అన్న సత్యాన్ని అర్థం చేసుకోలేక,విధవ బిడ్డకు జన్మనిచ్చిందని భావించారు.అందరూఒక్కటై మాచెమ్మను ఊరి నుంచి వెలివేశారు. ఏతప్పూ చేయని మాచెమ్మ ఎవరి మాటలను పట్టించుకోకుండా,పరమేశ్వరుని మీద భారం వేసి, ధైర్యంగా, అన్నీ తానైభీమన్నకు ఏ లోటు రాకుండా చూసుకొనేది. సాధ్యమైనంత వరకూ లోకపు దృష్టిని తప్పిస్తూపెంచసాగింది.గురుకుల పాఠశాలకు పంపి విద్యాభ్యాసము చేయించలేకున్నా,మాచెమ్మ భీమన్నకుశ్రీరాముని ధర్మనిష్ఠ, కుమారస్వామి విక్రమము, పరమశివుని భక్తవాత్సల్యము, శ్రీకృష్ణ పరమాత్ముని రాజనీతి, నలదమయంతుల కష్టదశ మొదలైన పురాణవృత్తాంతాలనుచెబుతూ పెంచింది.భీమన్న మేదస్సు దేనినయినా శరవేగముగా గ్రహించేది.
        ఆటలాడునపుడు తన తోటిబాలలు చుట్టూ చేరి భీమన్ననుపరిహాసంచేయడం, తన తల్లిని వెలివేయడం, ఊరిలో ఏ విశేషం జరిగినా తమను మాత్రం పిలవకపోవడంపసివాడైన భీమన్నకుపెద్దగా అర్థమయ్యేవి కావు. తమ ఇంటికి ఎవ్వరూ వచ్చేవారు కారు. ఇవన్నీ గమనించి విచారించేవారు.రోజులు గడిచే కొద్ది నిదానంగా లోకజ్ఞానం సంపాదిస్తూ, భీమన్న పదహారేళ్ళప్రాయంవాడయ్యారు.తండ్రి మరణం తర్వాత తాను పుట్టడం వల్ల తన తల్లిని నిందిస్తున్నారనీ, తననుపరిహాసం చేస్తున్నారనితెలుసుకున్న భీమన్న,ఎంతో ఆవేశంతో తన తల్లినే జరిగిన సంగతి అడుగుదామని ఇంటికి వచ్చారు.రాయెత్తి తన తల్లితో అమ్మ అందరూ నన్ను గోళకుడని నిందిస్తున్నారు. అది నిజమేనా? నా తండ్రి ఎవరో చెప్పవా?. నిజమేమిటో తెలియజేయవా? లేకుంటే ఈ రాయితో నీ బుర్ర పగులగొట్టమంటావా?“అని నిలదీసాడు. అందుకు మాచెమ్మ బిడ్డా! అంత కోపం ఎందుకు నయనా. నేను నిజం చెప్పినా నువ్వు నమ్మి ఈ ఊరివారిని నమ్మించగలవా?లేదు కదా?తిన్నగా ద్రాక్షారామానికి పోయి, అక్కడ భీమేశ్వరున్నిదర్శించి,శివలింగమును కౌగిలించుకొని ఇదే ప్రశ్ననుఅడుగు. ఆ భీమేశ్వరుడే నీకు అంతా చెబుతాడు. అలాఆయన పలుకకపోతే నా మీదకు రాయి ఎత్తి అడిగిన విధంగానే తనను కూడా అడుగు. నీ ప్రశ్నకు తప్పకుండా సమాధానము లభిస్తుంది.” అని చెప్పింది.
            భీమన్న రాయి పారేసి తల్లి పాదాలకు నమస్కరించి, భోజనం కూడా చేయకుండా తక్షణం ద్రాక్షారామముబయలుదేరారు. దారి పొడువునా భీమేశ్వరుని ధ్యానము చేసుకుంటూ ద్రాక్షారామము చేరారు. అక్కడ భీమేశ్వరున్ని దర్శించి, లింగమును కౌగిలించుకొని పరిపరి విధములగా స్తోత్రము చేస్తూ,తన తండ్రి ఎవరో నిజం చెప్పమని వేడుకున్నారు. ఎంత వేడుకున్నా పరమేశ్వరుడు పలుకకపోవడంతో భీమన్న మనసులో ఆవేదన అధికమయ్యింది. ఎలాగైనా పరమేశ్వరు నుంచి సమాధానంతోనే తిరిగి వెళ్ళాలని సంకల్పించుకున్న భీమన్న,  తన తల్లి మాట ప్రకారంభీమేశ్వరా!నాకు సమాధానం చెబుతావా? లేక పలుకలేని నీమూగ పాశాన లింగమును ఈ రాయితో పగులగొట్టి, అదే రాయితో కబుర్లు చప్పిన నా తల్లి తలనుపగులగొట్టమంటావా?” అని రాయెత్తి భీమేశ్వరునిలింగముపై వేయబోయారు. వెంటనే పరమేశ్వరుడు ఫ్రత్యక్షమయ్యి భీమన్నను ఆపి పుత్రవాత్సల్యముతో చేరదీసి, కుమారా! నువ్వు నీ తండ్రి మరణించిన తర్వాత నా అనుగ్రహము వలన, నా అంశతో జన్మించినావు. కావున నువ్వు నా తనయుడవే. నీ తల్లి మహాభక్తురాలు. ఆమె పుత్రలాభమును కోరింది. నిష్కల్మషమైన భక్తురాలు కోరిన కోరికను తీర్చడం కోసము నిన్ను అనుగ్రహించాను” అని భీమేశ్వరుడు పలికాడు.
        భీమన్న “తండ్రీ! నేను నీ కుమారుడనైతే, నన్ను అందరూ ఎందుకు నిందిస్తున్నారు?” అని అడుగగా,బోళాశంకరుడు “లోకులు నన్ను పూజిస్తారే గానీ నా మీద పరిపూర్ణమైన విశ్వాసంతో కాదు. నేను వారి అవసరాలు తీర్చుట కోసము. వారి అవసరాలను తీరుస్తాను అన్న విశ్వాసము వారిలో ఉంది కానీ, ఆది సంపూర్ణమైనది కాదు. అందువల్ల వారు నా లీలలను నమ్మలేకపోతున్నారు.వారు భగవంతుడు ఒక వితంతువుకు కూడా కుమారున్ని ఇవ్వగల శక్తిస్వరూపుడని విశ్వసించలేనిఅజ్ఞానాంధకారులవడం వలన నిన్నూ, నీ తల్లినినిందించి వెలివేసారు.నీకు ఉపనయనం చేసి, విద్యాభ్యాసము చేయడానికి ఎవరూ సిద్ధపడలేదు కావున,  తండ్రిగా ఈ బాధ్యతను నేనే నెరవేరుస్తాను” అని చెప్పి భీమన్నను నాలుక చాచమన్నాడు. పరమేశ్వరుడు భీమన్న నాలుక మీద వాగ్భామినీ బీజాక్షరాలను లిఖించి“నా తనయుడవైన నీవు, సకలశాస్త్రపారంగతుడవు.సకల భాషావేదివి. ఇక దేశయాటనముచేస్తూ నానా రాజసభలందు అనర్గళమైన, కవిత్వం చెబుతూవర్ధిల్లెదవు.నేటి నుంచి పశుపక్షిమృగాలు సకలప్రాణికోటి నీ మాటకు లోబడుతాయి. జీవులను పుట్టింప, గిట్టింప శక్తి కలదు నీకు. నేటి నుంచి నీవు ఏది పలికినా,అది జరుగుతుంది.నీ మాటకిక తిరుగుండదు.నువ్వు ఆడింది ఆట, పాడింది పాట.సంఘమున ఎంతటి వారైననూ నీ మాటకు లోబడవలసినదే.అని వరం ప్రసాదించి మాయమయ్యాడు.భీమన్న తాను స్వయానా పరమేశ్వరుని కుమారుడని తెలిసి మహదానందముతో వేములవాడకు బయలుదేరారు.
        భీమేశ్వరస్వామి దర్శనానికి వెళ్ళిన భీమన్న ఇంకా ఇంటికి తిరిగి రాకపోవడంతో మాచెమ్మకంగారుపడుతూ “భీమన్న మొండి పట్టుదల కలవాడే. దారిలోఏ ఇబ్బందీ కలుగలేదు కదా? నా చిట్టితండ్రి మార్గము తెలిసి క్షేమముగా వెళ్ళాడా? భీమేశ్వరుడు దర్శనమిచ్చుంటాడా?” అని పరిపరి విధాలుగా ఆలోచిస్తూ, భీమేశ్వరుని మీద భారం వేసింది.“సర్వేశ్వరా! ధీనబంధూ! పరమేశా! శతకోటి వందనాలు. నా కుమారుని నా వద్దకు క్షేమంగా పంపుమని” వేడుకొనసాగింది. ఇంటికి చేరిన భీమన్నను చూడగానే,మాచెమ్మకు పట్టరాని సంతోషం కల్గింది. వచ్చీరాగానే అమ్మకు పాదాభివందనం చేసి “అమ్మా నా మాటలతో నీ మనసును నొప్పించినందుకు నన్ను క్షమించు” అని వేడుకొని, ద్రాక్షారామ విశేషాలన్నిటినీ వివరించారు.



        వేములవాడ భీమకవి సంస్కృతంలో  రచించిన జ్యోతిష్య  గ్రంథమును తెలుగులో అనువదిస్తూ, ఒక కవి భీమకవి జన్మవృత్తాంతాన్ని ఈ సీసపద్యంలో వివరించారు.


సీ. శ్రీకరంబై ధరఁ జెలువుఁగాంచినయట్టి                        వెసఁజని యాతని వ్రేయనుంకించిన
     భీమపురంబునఁ బ్రేమమీఱ                                      భీమేశ్వరుడుదయ పెద్దగలిగి
భీమేశ్వరుండునుఁ బ్రియముతో భక్తుల                        ప్రత్యక్షమైవత్స! రమ్మని తగఁజేరి
     కోర్కులొసంగుచుఁ గొమరు మిగుల                             పశుపక్షి మృగములఁ బ్రాణికోట్ల
నొకనాఁడు తత్ఫురి యువతులుఁగొందఱు               గలిగించు శక్తియుఁ గరమొప్ప జనులకు
     భక్తి భీమేశ్వరు ‌భవనమునకుఁ                                  బిడ్డల నాయువుఁ బెంపుదనర     
బోయి పుత్రులవేడ ముగ్ధత్వమున నొక్క              సంపదలొసగెడు సామర్థ్యమునునిడి
     విధవ కుమారుని వేడ్కఁగోర                                    కానిది యౌనని యైనదెల్ల
నాలేమ ముగ్ధత కపహసించుచు నల                  గాదనినట్టులఁగావించు బలమును
     భీమేశ్వరుడు  పుత్రుఁ బ్రీతి నొసఁగ                            మునురాఁ గలుగునదియునుఁ దెలుపఁగఁ
నా కాంత గర్భిణియై కాంచెఁ దనయునిఁ                 బ్రావీణ్యమునునిచ్చి ప్రబలుము నీవని
      గలియుగాదిని బ్రేమ గడలు కొనగఁ                         వరమిచ్చెఁ బదియాఱు వర్షములకు     
బ్రభవ వర్షంబున శ్రావణమాసంపు                           నాతనికి సహాయమై సరస్వతియును
      శుక్లపక్షంబున శోభనంబు                                                                  ********
మీఱఁ బంచమి శుక్రవారంబునను హస్త                     నతడెట్లు చెప్పిననట్ల చేయుచునుండె  
      యందుఁ గన్యాలగ్నమందువెలయ                            సరిలేని కీర్తిచే జగతి వెలసి                
వెలివెట్టి రక్కాంత విధవయై పుత్రుని                    యతడు చెప్పిన శాస్త్రమందధిక భక్తి  
  గాంచెనటంచును  గడమజనము                         కలిగి నిజమని తలచిన గలుగుశుభము    
లంతఁదత్తనయుండు నైదేండ్ల బాలుడై                      కోర్కెలెల్లను ఫలియించు గురుతరముగ
    పురి బాలకుల తోడఁ బొసగనాడ                         సకల జనులకు దప్పదు జగతిలోన
జనులెల్ల గోళకుండని నిందఁజెసిన
      రోషించి యాతండు దూషితయని
ఱాయెత్తి తన తల్లి నేయఁ బోయిన యది
      భీమేశ్వరుడు తండ్రి వ్రేయమనిన                             

No comments:

Post a Comment

భీమలింగేశ్వర స్వామి వరప్రసాది - గడేకల్ బొబ్బిలి నాగిరెడ్డి

బొబ్బిలి నాగిరెడ్డి గడేకల్ భీమలింగేశ్వర స్వామి వరప్రసాది అని ప్రతీతి. ఈయన భీమలింగేశ్వర స్వామికి చేసిన సేవకి పూజకి స్వామి సంతోషించి పిలిస్తే ...