Showing posts with label దేవాలయాలు. Show all posts
Showing posts with label దేవాలయాలు. Show all posts

Tuesday 29 September 2020

శ్రీ క్షమదాంబ-సోమేశ్వర ఆలయము కురుడుమలై-ములబాగిలు

 

కురుడుమలైలో మహాగణపతి ఆలయానికి ఒక 100 అడుగుల ముందే దర్శనమిచ్చే మరో అత్యంత చారిత్రాత్మకమైన, పురాతనమైన దేవాలయమే శ్రీ క్షమదాంబ-సోమేశ్వర ఆలయము


ఈ ఆలయ క్షమదాంబ-సోమేశ్వరులను  కౌండిన్యమహర్షి ప్రతిష్టించారు. ఇక్కడివారు ఈ ఆలయానికి ఇప్పటికీ కౌండిన్య మహర్షి ఈ ప్రాంతంలో ఉన్నరనీ, రాత్రి వేళల ఇక్కడకు వచ్చి స్వామివారిని అర్చిస్తారని, అప్పుడప్పుడూ రాత్రివేళల మంత్రధ్వనులు వినపడుటుంటాయని చెబుతారు.

కౌండిన్యమహర్షి

అద్భుతమైన హోయసలశిల్పకళ నైపుణ్యము ఉట్టిపడేలా దాదాపు 1600 సంవత్సరాల క్రిందటి ఈ రాతి ఆలయము ఎటువంటి పునాదులు లేకుండా రాతిపై నిర్మించబడడం మరో విశేషం. ఈ ఆలయాన్ని కూడా చోళరాజులే నిర్మించారు. ఈ ఆలయశిల్పి కూడా అమరశిల్పి జక్కన.  


ఎత్తైన వేదికపై నిర్మించబడిన ఈ ఆలయప్రాంగణంలోకి ప్రవేశించగానే మొదటగా దర్శనమిచ్చేది ఎకశిలా వినాయకవిగ్రహము. అయితే బ్రిటీష్వారు ద్వంసం చేయడంచల్ల ఈ ఈ వినాయక విగ్రహానికి దంతాలు విరిగిపోయాయని ఇక్కడివారు చెబుతారు.

ఆలయంలోకి ప్రవేశించగానే ఎడమవైపు వినాయకుడు ఎదురుగా శ్రీదేవి,భూదేవి సమేతంగా విష్ణుమూర్తి దర్శనమిస్తారు. కుడివైపు కౌండిన్యమహర్షి ధర్మపత్నులతో పాటి దర్శనమిస్తారు.



సోమేశ్వరుణి దర్శించిన తరువాత శ్రీక్షమదాంబ ఆలయాన్ని కూడా చూడవచ్చు. 



అయితే విశేషమైనదినాలలో మాత్రమే దర్శనానికి శ్రీక్షమదాంబదేవాలయము తెరువబడి ఉంటుంది అనుకుంటాను. ఆలయ కిటికీ నుంచి అమ్మవారిని దర్శించవచ్చు. అలంకారములో అమ్మవారు స్వయానా దిగివచ్చారా అన్న విధంగా దర్శనమిస్తారు.

ఆలయస్తంభాలపై ఎన్నో పురాణేతిహాసాలను, మహాభక్తుల చరితలను వివిధ దేవతా మూర్తులచిత్రాలను, సనాతనధర్మాన్ని ప్రతిబింబించేలా, భవిష్యత్ తరాలకు అందించేలా చెక్కిఉండడం  చూపరులను ఎంతో విశేషంగా ఆకట్టుకుంటాయి.

ఆది గురువు దక్షిణామూర్తి


చోళరాజు-అమరశిల్పి జక్కన


భక్తమార్కండేయుడు



పార్వతి




పార్వతీ పరమేశ్వరులు

Add caption

బాలసుబ్రహ్మణ్యేస్వరస్వామి

సుబ్రహ్మణ్యేశ్వర వాహనం- నెమలి



భక్తకన్నప్ప

భక్తకన్నప్ప











Saturday 26 September 2020

త్రిమూర్తులచే పూజించబడ్డ కురుడుమలై మహాగణపతి

వాగీశాద్యాః సుమనసః సర్వార్థానాం ఉపక్రమే

యం సత్వా కృతకృత్యాస్యుః తం నమామి గజాననం

దేవతలు, తుదకు బ్రహ్మ కూడా ఏదైనా పనిని ఆరంభించి పూర్తి కావాలని అనుకొనేవారు గజాననుణ్ని కొలుస్తారని. బలహీనులైన మానవులే కాదు, బలవంతులైన దేవతలూ కొలుస్తారట. వారు నిర్దిష్టమైన తిథుల్లోనే కాదు, ఏదైనా పని ఆరంభించినపుడు, నిరంతరమూ కొలుస్తారట. అలా కొలిస్తే చేసిన పనులు ఫలిస్తాయని శ్లోకం చెబుతోంది


బెంగలూరుకు దాదాపు 100కి.మి. దూరాన ములబాగిలు దగ్గర ఉన్న అత్యంత విశేషమైన కురుడుమలై వినాయకుడి క్షేత్ర ఆవిర్భావానికి ఇదే నేపథ్యం అని చెప్పవచ్చు. ఇంకోవిధంగా చేప్పాలంటే ఈ శ్లోకానికి ప్రత్యక్షనిదర్శనమే మహిమాన్వితమైన కురుడుమలై గణపతి క్షేత్రము. 



సదా బాల రూపాపి విఘ్నాద్రి హంత్రీ

మహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్యా

వినాయకుడు బాలరూపంలో ఉంటాడు(సదా బాల రూపి). అయినా (అపి) కొండలవంటి విఘ్నాలను పిండి చేస్తాడు (విఘ్నాద్రి హంత్రీ). అతడేనుగైనా సింహం చేత పూజింపబడ్డాడు (మహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్యా).

 ఇక్కడ పంచాస్య అంటే ఇక్కడ సింహమని భావిస్తాం, కానీ ఇక్కడ సింహం కాదు, పరమ శివుడే. త్రిపురాసుర సంహారము విషయంలో విఘ్నేశ్వరుణ్ణి శివుడు పూజించలేదా? వివరాల్లోకి వెలితే....  

కృతయుగములో విద్యున్మాలితారకాక్షుడుకమలాక్షుడు అనే త్రిపురాసుర సంహారమునకు బయలుదేరినపుడు ఈశ్వరుడు గణపతిని ధ్యానించలేదట. అందరు దేవతలు ముందుగా గణపతిని పూజించాలి,శివుడు కూడా దాటడానికి వీలు లేదు. పూజించకుండానే ఈశ్వరుని రథము బయలుదేరబోతోంది. ఇరుసు విరిగిపోవుగాక అని గణపతి అనగా అది విరిగింది.

మహేశ్వరుడు నేను నియమాన్ని అతిక్రమించానే, నేనేమో అందరికంటే పెద్ద అని భావించాను. నియమాలను పాటించడంలో వ్యక్తిగతమైన గొప్పదనం పోకూడదని మహేశ్వరుడు, బ్రహ్మ, విష్ణువులతో పాటు గణపతిని పూజించాడు. వెంటనే ఆటంకాన్ని తొలగించాడు వినాయకుడు. రథము కదిలింది. త్రిపురాసురులను జయించాడు శంకరుడు. త్రిపురాంతకుడు అని బిరుదు పొందాడు.

 

ఇలా త్రిమూర్తులు ఆరాధించిన శక్తి గణపతే, అపరిమిత శక్తివంతుడు, విఘ్ననాశకుడు ములబాగిలులో ఉన్న కురుడుమలై వినాయకుడు. 

త్రిమూర్తులు ప్రతిష్టించిన 14 అడుగుల ఏక సాలగ్రామ మహాగణపతి. ముగ్ధమనోహర-దివ్యసుందరుడూ, సుముఖుడూ అయిన గణపతిని ఎంతసేపు చూసినా తనివి తీరదు. ఇంకా చూడాలనే అనిపిస్తుంది. ఇది అనుభవపూర్వక వాస్తవము. 

తరువాతి యుగాల్లో త్రేతాయుగమున రావణవధకు లంకకు బయలుదేరే మునుపు శ్రీరామచంద్రుడు, ద్వాపరయుగమున శమంతకమణి విషయంలో నీలాపనీండలు తొలగించుకొనుటకు శ్రీకృష్ణుడు కురుడుమలై గణపతిని పూజించారని చేబుతారు. పాండవులు కూడా పూజించారని ఇక్కడి స్థలపురాణం.

ఆలయము చోళరాజులచే నిర్మించబడినది. శిల్పి జక్కనదేవాలయగోడలపై హోయాలుల నిర్మాణ శైలి కనపడుతుంది

శ్రీకృష్ణదేవరాయలుకు కలలో స్వామివారు సాక్షాత్కరించి ఆలయప్రాకారము నిర్మించమని ఆదేశించారని తరువాత ఆయన ప్రాకారమును నిర్మించాడని శాసనాల ద్వారా తెలుస్తోంది.

సృష్టి-స్థితి-లయ కారకులే స్వయంగా ఈ సాలిగ్రామ వినాయకుణ్ణి ప్రతిష్టించి పూజించిన కురుడుమలై వినాయక తత్త్వం ఎంత శక్తిమంతమో, ఉదారమో ప్రత్యేకించి చెప్పనవసరములేదు. ఈ గణపతి సన్నిధిలో చేసే ధ్యానము ఎంతో ఆధ్యాత్మిక ఉన్నతిని , మానసిక ప్రశాంతతను, (+ve energy) నింపుతుంది.

ఏదైనా కొత్త పని మొదలు పట్టే ముందు, బాధలతో సతమతమయ్యే వారు తప్పక దర్శించి ఆశీస్సులు తీసుకుంటే వారి పనులు నిర్విఘ్నంగా అద్భుతంగా పనులు పూర్తి అవుతాయి.

పనులు జరగక విఘ్నాలు విసిగిస్తుంటే స్వామి దర్శన మాత్రం చేత అడ్డంకులు తొలగిపోయి మంచి జరుగుతుంది. అక్కడ ఉన్న శక్తి మనకున్న దోషాలను, అరిష్టాలను పారద్రోలి మంచి సమయం మొదలవుతుంది.

స్వామివారి వాహనం ఎలుక 


చాముండీ అమ్మవారు

       సుబ్రహ్మణేశ్వరస్వామి


ఆలయ పుష్కరిణి


Temple timings : Morning 8 to 11.30 in morning and 5 to 7 in the evening.




Sunday 13 September 2020

భూపతమ్మ సప్తమాత దేవాలయము, శ్రీచక్ర సహిత సప్తమాత ఆలయము, మాలూరు-బెంగలూరు

 బ్రాహ్మీ మాహేశ్వరీ చైవ కౌమారీ వైష్ణవీ తథా,

వారాహీ చైవ చేంద్రాణి చాముండా సప్తమాతరః

శ్రీచక్ర సహిత సప్తమాత ఆలయము, మాలూరు

పూర్వం అంధకాసురుడు అనే రాక్షసుడి ఆగడాలు మితిమీరడంతో, వాడిని సంహరించడానికి శివుడు సిద్ధమయ్యాడు. అంధకాసురుడితో రుద్రుడు పోరాడుతూ వుండగా రాక్షసుడి నుంచి చిందిన రక్త బిందువులు రాక్షసులుగా మారేవి.

విషయాన్ని గ్రహించిన శివుడు మహేశ్వరిని రంగంలోకి దింపాడు. 'వృషభ' వాహనంపై ఆమె యుద్ధభూమిలోకి ప్రవేశించిందిదాంతో బ్రహ్మ పంపిన బ్రహ్మణి 'హంస' వాహనంపైవిష్ణుమూర్తి పంపిన వైష్ణవి 'గరుడ' వాహనం పైకుమార స్వామి పంపిన కౌమారీ 'నెమలి' వాహనం పైవరాహమూర్తి పంపిన వారాహి 'మహిష' వాహనం పైఇంద్రుడు పంపిన ఇంద్రాణి 'ఐరావతం' పైయముడు పంపిన చాముండి 'శవ' వాహనం పై యుద్ధభూమికి చేరుకున్నాయి.

అంధకాసురవధకు శివుడికి సహాయం చేసిన ఆదిశక్తి స్వరూపాలైన బ్రహ్మణి, మహేశ్వరీ, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి దేవతలే ఈ సప్త మాతృకలు.

ఆటువంటి మహిమాన్వితమైన సప్తమాతృకల దేవాలయము బెంగలూరు నుంచి మాలూరు కు వెళ్ళే మార్గంలో(25kms) ఒక చిన్న కోండగుట్టపై అద్భుతంగా నిర్మింపబడి ఉంది.

సప్తమాతల మూలవిరాట్టులు “భూపతమ్మ సప్తమాత దేవాలయము”లో కొలువుదీరి ఉన్నాయి. ఈ ఆలయము యెప్పటి నుంచో ఉన్నది. అయితే ఈ ఆలయ స్థల పూరాణవివరాలు తెలియలేదు. అయితే ఈ మధ్యన ఆలయ అభివృద్ధి కమిటీ ఆలయాన్ని అభివృద్ధి చేసి “శ్రీచక్ర సహిత సప్తమాత ఆలయాన్ని” కొత్తగా నిర్మించి సరైన వసతులు కల్పించారు.  

భూపతమ్మ సప్తమాత దేవాలయము - సప్తమాతల మూలవిరాట్టులు “:




కొత్తగా నిర్మించిన శ్రీచక్ర సహిత సప్తమాత ఆలయము:







ఈ కొత్త ఆలయంలో శ్రీచక్ర సహిత సప్తమతలు బ్రహ్మణి, మహేశ్వరీ, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి కొలువుదీరారు.
    


నవగ్రహదేవతలు:

         


అమ్మవారి ఉత్సవమూర్తులు:





సువిశాలమయిన ఆలయ  ప్రాంగణము, చూట్టూ నిండిన పచ్చదనము, ముగ్ధమనోహర-ప్రశాంతమైన వాతావరణము, మూర్తీభవించిన అమ్మవారి దివ్యమంగళరూపము సందర్శకులకు, భక్తులకు ఆధ్యాత్మిక ఉన్నతిని, మానసిక ప్రశాంతతను సొంతము చేస్తున్నాయి.

 



బెంగలూరుకు దగ్గరలో ఉండడము వల్ల కుటుంబముతో వనభోజనము లాంటి వాటికి సరైన ప్రదేశము. అంతే కాకుండా ఇక్కడ భక్తులు అమ్మవారుకు నైవెద్యము ఇక్కడే వండి సమర్పించడం ఇక్కడి ఆనవాయితీ

ఇంకో విశేషం ఏమంటే ఎక్కడ చూడని విధంగా ఈ ఆలయం బయటి కుడ్యాలపైన సప్తకన్యలయిన రాజకన్య, దేవకన్య, తమరకన్య, సింధుకన్య, గిరికన్య, వనకన్య, నీలకన్య ఇంకా సప్త నదీమతల్లులయిన గంగ, యమున, గోదావరి, సరస్వతి, నర్మద, సింధు, కావేరి దేవతలు కొలువు దీరి ఉండడం.

సప్తకన్యలు:

పరమ పవిత్రమైన సప్తనదీమతల్లులు:

అర్చన-పూజలు తదితర వివరాలు:

 

Timings:


Route Map:

బెంగలూరు-కొలార్ హైవే నుంచి మాలూరూ కు టర్న్ తీసుకున్న కొద్ది దూరం వెళ్ళాక దేవాలయనికి 1.5కి.మి ఉండంగా google maps సరీగా చూపించకపోవచ్చు. అందుకోసము “chola turbo machinery international pvt ltd” వైపుకు రోడ్దు నుంచి మట్టి రోడ్డుకు మలుపు తీసుకోవాలి .  chola turbo machinery international pvt ltd” తరువాత "lions club international" ,ఇక ఆతరువాత ఆలయం వైపుకే.




   






భీమలింగేశ్వర స్వామి వరప్రసాది - గడేకల్ బొబ్బిలి నాగిరెడ్డి

బొబ్బిలి నాగిరెడ్డి గడేకల్ భీమలింగేశ్వర స్వామి వరప్రసాది అని ప్రతీతి. ఈయన భీమలింగేశ్వర స్వామికి చేసిన సేవకి పూజకి స్వామి సంతోషించి పిలిస్తే ...