Saturday 26 September 2020

త్రిమూర్తులచే పూజించబడ్డ కురుడుమలై మహాగణపతి

వాగీశాద్యాః సుమనసః సర్వార్థానాం ఉపక్రమే

యం సత్వా కృతకృత్యాస్యుః తం నమామి గజాననం

దేవతలు, తుదకు బ్రహ్మ కూడా ఏదైనా పనిని ఆరంభించి పూర్తి కావాలని అనుకొనేవారు గజాననుణ్ని కొలుస్తారని. బలహీనులైన మానవులే కాదు, బలవంతులైన దేవతలూ కొలుస్తారట. వారు నిర్దిష్టమైన తిథుల్లోనే కాదు, ఏదైనా పని ఆరంభించినపుడు, నిరంతరమూ కొలుస్తారట. అలా కొలిస్తే చేసిన పనులు ఫలిస్తాయని శ్లోకం చెబుతోంది


బెంగలూరుకు దాదాపు 100కి.మి. దూరాన ములబాగిలు దగ్గర ఉన్న అత్యంత విశేషమైన కురుడుమలై వినాయకుడి క్షేత్ర ఆవిర్భావానికి ఇదే నేపథ్యం అని చెప్పవచ్చు. ఇంకోవిధంగా చేప్పాలంటే ఈ శ్లోకానికి ప్రత్యక్షనిదర్శనమే మహిమాన్వితమైన కురుడుమలై గణపతి క్షేత్రము. 



సదా బాల రూపాపి విఘ్నాద్రి హంత్రీ

మహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్యా

వినాయకుడు బాలరూపంలో ఉంటాడు(సదా బాల రూపి). అయినా (అపి) కొండలవంటి విఘ్నాలను పిండి చేస్తాడు (విఘ్నాద్రి హంత్రీ). అతడేనుగైనా సింహం చేత పూజింపబడ్డాడు (మహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్యా).

 ఇక్కడ పంచాస్య అంటే ఇక్కడ సింహమని భావిస్తాం, కానీ ఇక్కడ సింహం కాదు, పరమ శివుడే. త్రిపురాసుర సంహారము విషయంలో విఘ్నేశ్వరుణ్ణి శివుడు పూజించలేదా? వివరాల్లోకి వెలితే....  

కృతయుగములో విద్యున్మాలితారకాక్షుడుకమలాక్షుడు అనే త్రిపురాసుర సంహారమునకు బయలుదేరినపుడు ఈశ్వరుడు గణపతిని ధ్యానించలేదట. అందరు దేవతలు ముందుగా గణపతిని పూజించాలి,శివుడు కూడా దాటడానికి వీలు లేదు. పూజించకుండానే ఈశ్వరుని రథము బయలుదేరబోతోంది. ఇరుసు విరిగిపోవుగాక అని గణపతి అనగా అది విరిగింది.

మహేశ్వరుడు నేను నియమాన్ని అతిక్రమించానే, నేనేమో అందరికంటే పెద్ద అని భావించాను. నియమాలను పాటించడంలో వ్యక్తిగతమైన గొప్పదనం పోకూడదని మహేశ్వరుడు, బ్రహ్మ, విష్ణువులతో పాటు గణపతిని పూజించాడు. వెంటనే ఆటంకాన్ని తొలగించాడు వినాయకుడు. రథము కదిలింది. త్రిపురాసురులను జయించాడు శంకరుడు. త్రిపురాంతకుడు అని బిరుదు పొందాడు.

 

ఇలా త్రిమూర్తులు ఆరాధించిన శక్తి గణపతే, అపరిమిత శక్తివంతుడు, విఘ్ననాశకుడు ములబాగిలులో ఉన్న కురుడుమలై వినాయకుడు. 

త్రిమూర్తులు ప్రతిష్టించిన 14 అడుగుల ఏక సాలగ్రామ మహాగణపతి. ముగ్ధమనోహర-దివ్యసుందరుడూ, సుముఖుడూ అయిన గణపతిని ఎంతసేపు చూసినా తనివి తీరదు. ఇంకా చూడాలనే అనిపిస్తుంది. ఇది అనుభవపూర్వక వాస్తవము. 

తరువాతి యుగాల్లో త్రేతాయుగమున రావణవధకు లంకకు బయలుదేరే మునుపు శ్రీరామచంద్రుడు, ద్వాపరయుగమున శమంతకమణి విషయంలో నీలాపనీండలు తొలగించుకొనుటకు శ్రీకృష్ణుడు కురుడుమలై గణపతిని పూజించారని చేబుతారు. పాండవులు కూడా పూజించారని ఇక్కడి స్థలపురాణం.

ఆలయము చోళరాజులచే నిర్మించబడినది. శిల్పి జక్కనదేవాలయగోడలపై హోయాలుల నిర్మాణ శైలి కనపడుతుంది

శ్రీకృష్ణదేవరాయలుకు కలలో స్వామివారు సాక్షాత్కరించి ఆలయప్రాకారము నిర్మించమని ఆదేశించారని తరువాత ఆయన ప్రాకారమును నిర్మించాడని శాసనాల ద్వారా తెలుస్తోంది.

సృష్టి-స్థితి-లయ కారకులే స్వయంగా ఈ సాలిగ్రామ వినాయకుణ్ణి ప్రతిష్టించి పూజించిన కురుడుమలై వినాయక తత్త్వం ఎంత శక్తిమంతమో, ఉదారమో ప్రత్యేకించి చెప్పనవసరములేదు. ఈ గణపతి సన్నిధిలో చేసే ధ్యానము ఎంతో ఆధ్యాత్మిక ఉన్నతిని , మానసిక ప్రశాంతతను, (+ve energy) నింపుతుంది.

ఏదైనా కొత్త పని మొదలు పట్టే ముందు, బాధలతో సతమతమయ్యే వారు తప్పక దర్శించి ఆశీస్సులు తీసుకుంటే వారి పనులు నిర్విఘ్నంగా అద్భుతంగా పనులు పూర్తి అవుతాయి.

పనులు జరగక విఘ్నాలు విసిగిస్తుంటే స్వామి దర్శన మాత్రం చేత అడ్డంకులు తొలగిపోయి మంచి జరుగుతుంది. అక్కడ ఉన్న శక్తి మనకున్న దోషాలను, అరిష్టాలను పారద్రోలి మంచి సమయం మొదలవుతుంది.

స్వామివారి వాహనం ఎలుక 


చాముండీ అమ్మవారు

       సుబ్రహ్మణేశ్వరస్వామి


ఆలయ పుష్కరిణి


Temple timings : Morning 8 to 11.30 in morning and 5 to 7 in the evening.




No comments:

Post a Comment

భీమలింగేశ్వర స్వామి వరప్రసాది - గడేకల్ బొబ్బిలి నాగిరెడ్డి

బొబ్బిలి నాగిరెడ్డి గడేకల్ భీమలింగేశ్వర స్వామి వరప్రసాది అని ప్రతీతి. ఈయన భీమలింగేశ్వర స్వామికి చేసిన సేవకి పూజకి స్వామి సంతోషించి పిలిస్తే ...