Thursday 17 September 2020

శ్రీ బాలాత్రిపురసుందరీ ధ్యాన శ్లోకం (భావముతో)


లలితాదేవి పుత్రిక అయిన బాలాత్రిపురసుందరీ విమర్శశక్తి, ఆ శక్తి ఆరాధన వల్ల విద్య,లక్ష్యసిద్ధి, మోక్షము మూడూ సిద్ధిస్థాయి.

భండపుత్రులు 30 మంది. వీరి పని శతృవులను భ్రమకు(మాయ) గురిచేసి వంచన చేసి గెలువడము, అమ్మవారి అంశ అయిన బాలాదేవి వారిని సైన్యంతో సహా వధిస్తుంది. బాలాదేవి సమస్త బంధాలను తద్వారా మాయ నశింపచేసి ఆత్మానందమును అందిస్తుంది.

అంతటి మహిమాన్వితమైన బాలా త్రిపురసుందరి స్వరూపాన్ని ధ్యానశ్లోకము ద్వారా తెలుసుకుందాము.

అరుణకిరణజాలైరంచితాశావకాశా

విధృతజపపుటీకా పుస్తకాభీతిహస్తా

ఇతరవరకరాఢ్యా ఫుల్లకల్హారసంస్థా

నివసతు హృది బాలా నిత్య కళ్యాణశీలా

 భావము: ఎర్రని కిరణకాంతులను వెదజల్లుతూ.. జప మాల, పుస్తకము,వరద అభయ హస్తాలతో విరాజిల్లుతూ..విచ్చుకున్న తెల్లని పద్మం పువ్వులో ఆసీనురాలై ఉన్న మంగళప్రదాయిని శ్రీ బాలా త్రిపురసుందరీ దేవి నిత్యమూ నా హృదయము నందు ప్రకాశించును గాక


No comments:

Post a Comment

భీమలింగేశ్వర స్వామి వరప్రసాది - గడేకల్ బొబ్బిలి నాగిరెడ్డి

బొబ్బిలి నాగిరెడ్డి గడేకల్ భీమలింగేశ్వర స్వామి వరప్రసాది అని ప్రతీతి. ఈయన భీమలింగేశ్వర స్వామికి చేసిన సేవకి పూజకి స్వామి సంతోషించి పిలిస్తే ...