Friday 24 July 2020

మేడమార్యుడు-భీమకవి




              
        మేడమార్యుడు కులోత్తుంగదేవుడి కుమారుడగు వీరచోడదేవుడి వద్ద సైన్యాధిపతిగా ఉండెను. ఇతనికి వేములవాడ భీమకవి స్వయంగా “రాజ రాజ బ్రహ్మ మహా రాజ”  అని బిరుదు ఇచ్చారు. ఇతను వేదవేదాంగవేదియైన ఉత్తమద్విజుడు. ధనుర్వేదమును కూడా అభ్యసించాడు. భుజబలపరాక్రముడు. రాజనీతివేత్త కూడా. అందుకే వీరచోడదేవుడితనినితన సైన్యాధిపతిగా నియమించాడు. ఇతను కూడా ఆ కాలమున ఏయుద్ధానికివెళ్ళాల్సివచ్చినా,  భీమకవి వద్దకు వచ్చి, ఆయనఆశీర్వాదమును తీసుకొని వెళ్ళేవాడు. అందువలన ఈతను ఏ యుద్ధానికేగిననూ విజయమే తప్ప పరాజయము కలుగలేదు. వెళ్ళిన ప్రతి యుద్ధములో విజయముతో తిరిగిరావడం వల్ల వీరచోడదేవుడిని మేడమర్యుడు ఎంతో అభిమానించేవాడు.  వీరచోడదేవుడు, మేడమర్యుని “రాజ రాజ బ్రహ్మ మహా రాజ” అనే పిలిచేవాడు. తను కూడా “ నాకీ బిరుదు భీమకవి ఇచ్చినదని” గొప్పగా చెప్పుకొనేవాడు. ఇతడు భీమకవిని ఎంతో భక్తి విశ్వాసాలతో సేవించాడు. భీమకవి వద్ద ధర్మోపదేశం ప్రకారం, తన బంధువులపట్ల ఎంతో గౌరవాభిమానాలు చూపుతూ, పేదవారయిన సన్మార్గులకు దానధర్మాలను చేస్తూ, తన జీవితమంతా భీమకవిసేవకే వదిలివేసాడు. అంతేకాక పిఠాపురము, ద్రాక్షారామాల్లో భీమకవి పేరిట సత్రములను కూడా కట్టించాడు. అక్కడ నిత్యాన్నదానములను చేయించాడు. చెల్లూరులో వైష్ణవాలయమును కట్టించి, ఒక కోనేరును త్రవ్వించి కర్తృత్వమును భీమకవి ఇచ్చివేసాడు.

No comments:

Post a Comment

భీమలింగేశ్వర స్వామి వరప్రసాది - గడేకల్ బొబ్బిలి నాగిరెడ్డి

బొబ్బిలి నాగిరెడ్డి గడేకల్ భీమలింగేశ్వర స్వామి వరప్రసాది అని ప్రతీతి. ఈయన భీమలింగేశ్వర స్వామికి చేసిన సేవకి పూజకి స్వామి సంతోషించి పిలిస్తే ...