Friday 24 July 2020

భీమకవి కాలం - విశ్లేషణ


భీమకవి చాలా కాలము వివిధ రాజ్యాలు తిరుగుతూ, కవిత్వము చెబుతూ, ఎన్నో మహిమలను చూపారు. ఇలా మనకు పద్యాల్లో దొరికిన ఆధారాలు కొన్ని మాత్రమే. ఎందుకంటే భీమకవి ఆయా సందర్భాల్లో చెప్పిన చాటుపద్యాలు, ఆయా వ్యక్తుల కాలాలను పరిగణలోకి(ఆధారంగా) తీసుకుంటే పదకొండో శతాబ్దం మొదలుకొని దాదాపు నాలుగు వందల సంవత్సరాలకు పైగా వివిధ రాజ్యాలను తిరిగినట్లు తెలుస్తుంది. ఆట్టి సందర్భములో ఈయన జీవితానికి సంబంధించి మనకు దొరికిన ఆధారాలు చాలా కొన్నిగా భావించక తప్పదు. అంతేకాక ఈయన చూపిన మహిమల్లో మనకు తెలియనివెన్నో, ఈయనచే ప్రభావితం చేయబడినవారెందరో మనకు తెలియని వారు ఉన్నారు అన్నది ఆసక్తికర విషయం. ఈ విషయం అలా ఉంచితే, అయితే ఈయన తొలితరం తెలుగు కవి కావడం వలన, అంతేకాక ఒకే ప్రాంతానికి పరిమితము కాకుండా సంచారము చేస్తూ జీవించారు.వివిధ ప్రాంతాలలో ఈయన కావ్యాలను గురించి ఆనాటి కవులు పొగుడుతూ వ్రాసిన కావ్యాలు లభించాయి, కానీ ఈయన కావ్యాలు మాత్రం ఇంకా సంపూర్ణంగా లభించాల్సిఉంది(తాలప్రతుల నుంచీ బ్రౌనుగారు పేపరు ప్రతులను వ్రాయించాక, ఏ ప్రాంతాలలో ఏఏ గ్రంథాలయాలలో ఈయన కావ్యాలు మరుగున పడి ఉన్నయో దొరకాల్సిఉంది).కవిజనాశ్రయం అనే ఛందస్సుకొద్ది కాలము క్రిందట లభించి ప్రచురణకు నోచుకుంది. ఈయన జ్యోతీష్యగంథాలు ఒకటి రెండు ద్రాక్షారామప్రాంతాలలో లభిస్తాయి. గ్రంథాలయాల్లో మరుగునపడి ఇప్పటికి మాకు లభించిన కావ్యాల్లో కవిరాక్షసీయం ఒకటి. ఇంకా దొరకాల్సినవెన్నో. అవన్నీ త్వరలో లభిస్తాయని ఆశిద్దాం. చారిత్రకారులకు ఈయన వివిధ వ్యక్తులకు సమకాలికునిగా కనిపిస్తూ, వారందరి కాలాలను పరిగనలోకి తీసుకుంటే 400 ఏళ్ళకు పైగా జీవించినట్లు తెలుస్తోంది.అందువలన వారు నేటికీ వేములవాడ భీమకవి కాలనిర్ణయం చేయలేకపోయారు. లభించిన ఆధారాలలోఒక్కొక్కరు ఒక్కొక్క బలమైన ఆధారమును చూపి,కొందరు 11వ శతాబ్ధము వాడని, మరికొందరు 12వ శతాబ్ధము వారని, కాదు 13వశతాబ్ధము వారని, 14వ శతాబ్ధము వారని వివిధ రకాలుగా నిర్ధారించారు. ఇది వారికి ఇప్పటికీ వీడని చిక్కుముడిగానే మిగిలిపోయింది. చరిత్రకారులు చూపిన ఆధారాలున్నందున,భీమకవి ఇన్ని సంవత్సరాలు సంచారము చేస్తూగడిపారన్న విషయంనమ్మకతప్పదు.అంతేకాక సాక్షాత్తు పరమేశ్వరుని వరపుత్రుడు. పరమేశ్వరుని నుంచిఆడింది ఆట పాడింది పాట అగు తిరుగులేని వరము పొందిన వారు, దైవాంశసంభూతుడూకావడం వలనమనం ఇన్ని ఏళ్లు తిరిగాడన్నా ఆశ్చర్యపడాల్సినవసరం లేదు.

31.    మూలము

·        మలకపల్లి పెదశేషగిరిరావు గారు రచించిన “ఉద్దండ కవి వేములవాడ భీమకవి చరిత్ర” 
·        జొన్నలగడ్డ వేంకట రాధాకృష్ణయ్య గారు రచించిన వేములవాడ భీమకవి చరిత్ర” 
·        మద్దూరి శ్రీ రామమూర్తి కవిగారు రచించిన  “వేములవాడ భీమకవి చరిత్రము” 
·        కందుకూరి వీరేశలింగంపంతులు రచించిన “ఆంధ్రకవుల చరిత్ర  ప్రథమభాగము.
·        పుట్టపర్తి నారాయణ కవి గారు రచించిన “ఆంధ్ర మహాకవులు 
·        వానపల్లి సత్యనారాయణాచార్య సిద్ధంతి రచించిన “మహాకవి భీమన నాటకం
·        వేటూరి ప్రభాకర శాస్త్రి గారి “ చాటుపద్యమంజరి


No comments:

Post a Comment

భీమలింగేశ్వర స్వామి వరప్రసాది - గడేకల్ బొబ్బిలి నాగిరెడ్డి

బొబ్బిలి నాగిరెడ్డి గడేకల్ భీమలింగేశ్వర స్వామి వరప్రసాది అని ప్రతీతి. ఈయన భీమలింగేశ్వర స్వామికి చేసిన సేవకి పూజకి స్వామి సంతోషించి పిలిస్తే ...