Friday 7 August 2020

శ్రీ లలితా ధ్యానశ్లోకము "సిందూరారుణ విగ్రహాం త్రినయనాం"

 ప్రతీ దేవతకీ మంత్రం ఉన్నట్లే ధ్యానశ్లోకం ఉంటుంది. ఆ ధ్యానశ్లోకం ఆ దేవతారూపాన్ని తెలుపుతుంది. దేవతారాధనలో ధ్యానశ్లోకముతో ఆ దేవతను ఏకాగ్రమనస్సుతో దర్శించిన పిదప ఆ తరువాత ఆ దేవతారూపాన్ని భావిస్తూ నిత్య నామ పారాయణ, మంత్రోపాసన చేయడము ఎంతో ఏక్కగ్రతను ఫలితాన్ని ఇస్తుంది. ఇందుకోసము ఆ భగవంతుని ధ్యానశ్లోకమును భావనతో దర్శించాలంటే మనకు ఆ శ్లోకార్థము తెలియాల్సిందే. అందులో భాగంగా లలితా ధ్యానశ్లోకము...  

సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళి స్ఫురత్

తారా నాయక శేఖరామ్ స్మితముఖీం ఆపీన వక్షోరుహామ్,

పానిభ్యామ్ అలిపూర్ణ రత్న చషకం రక్తోత్పలం విభ్రతీం ,

సౌమ్యామ్ రత్న కటస్థ రక్త చరణాం, ధ్యాయేత్ పరామంబికామ్.

సిందూరము వలె ఎర్రనైన శరీరమును, 3 నేత్రములు కలిగిన తల్లి, మాణిక్యములతో చేయబడిన కిరీటము శిరస్సున ధరించి ఆ కిరీటాగ్రమున మహా మాణిక్యములా ప్రకాశించే చంద్రుడిని శిరోభూషణము గా ధరించిన తల్లి. ఎల్లవేలలా చిరునగవులు కల తల్లి. అపితకుచాంబ(సమస్త సృష్టినీ తన బిడ్డలుగా కల తల్లి అందరినీ సమముగా చూస్తూ వినాయకుడికి, సుబ్రహ్మణేశ్వరస్వామికి కూడా స్తన్యం ఇవ్వలేదు). ఒకచేతిలో తుమ్మెదలతోమూగిన పరిమలభరిత మద్యముతో నిండిన పానపాత్రమూ. మరొకచేతిలోఎర్రని కలువ పూలు ధరించిన తల్లి. రత్నఘటము నందు తన ఎర్రని పాదములను ఉంచి, సౌమ్యముగా కూర్చున్న అమ్మ లలితమ్మను ధ్యానిస్తున్నాను.

No comments:

Post a Comment

భీమలింగేశ్వర స్వామి వరప్రసాది - గడేకల్ బొబ్బిలి నాగిరెడ్డి

బొబ్బిలి నాగిరెడ్డి గడేకల్ భీమలింగేశ్వర స్వామి వరప్రసాది అని ప్రతీతి. ఈయన భీమలింగేశ్వర స్వామికి చేసిన సేవకి పూజకి స్వామి సంతోషించి పిలిస్తే ...