Saturday 8 August 2020

శ్రీ లలితా ధ్యానశ్లోకము "సకుంకుమ విలేపనాం అళికచుంబి కస్తూరికాం"

 

సకుంకుమ విలేపనాం అళికచుంబి కస్తూరికాం

సమందహసితేక్షణాం సచర చాప పాశాంకుశాం

అశేషజన మోహినీం అరుణ మల్య భూషంబరాం

జపాకుసుమ భాసురాం జపవిధౌ స్మరేదంబికాం  

నుదుటన కస్తూరీ తిలకము ధరించినది. చిరునగవు చిందించునది(పాలు తాగుతున్న బిడ్డ ఒక్కసారి తల త్రిప్పి అమ్మను చూసినప్పుడు, అమ్మ సంతోషంతో ఎలా చిరునవ్వు చిందిస్తుందో అలా అనుకోవచ్చు).పాశము, అంకుశము, ధనుస్సు, భాణములను చేతులందు ధరించినది. లోకాలన్నిటినీ మోహింపచేయునదీ, ఎర్రని వస్త్రములను ధరించినది. మందారపువ్వు వలె ఎర్రని వర్ణం గలది అయిన అమ్మవారిని ధ్యానిస్తున్నాను.

No comments:

Post a Comment

భీమలింగేశ్వర స్వామి వరప్రసాది - గడేకల్ బొబ్బిలి నాగిరెడ్డి

బొబ్బిలి నాగిరెడ్డి గడేకల్ భీమలింగేశ్వర స్వామి వరప్రసాది అని ప్రతీతి. ఈయన భీమలింగేశ్వర స్వామికి చేసిన సేవకి పూజకి స్వామి సంతోషించి పిలిస్తే ...