Monday 3 August 2020

హయగ్రీవ జయంతి

జ్ఞానానంద మయం దేవం నిర్మల స్పఠికాకృతిమ్‌ 

ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే

పరమేశ్వరుడిని గురువుగా భావిస్తే దక్షిణామూర్తిగా అనుగ్రహిస్తాడు. అమ్మవారిని గురువుగా కొలిస్తే శారదగా జ్ఞానం ప్రసాదిస్తుంది. విష్ణుమూర్తిని గురువుగా పూజిస్తే.,హయగ్రీవుడుగా కరుణిస్తాడు.ఆయన అవతరించిన శ్రావణ శుద్ధ పౌర్ణమిని హయగ్రీవ జయంతిగా జరుపుకుంటారు.

తెల్లని తెలుపు మానవ శరీరం, గుర్రం (అశ్వము) యొక్క తల, నాలుగు చేతులు. శంఖము మరియు చక్రము పై రెండు చేతులలో కలిగి యుండును. క్రింది కుడి వ్రేళ్ళు జ్ఞాన ముద్రలో అక్షరమాలను కలిగి యుంటాయి.ఎడమ చేతిలో పుస్తకము ఉంటుంది

 హయగ్రీవుడు చదువులకు అధిదైవం..హయగ్రీవుణ్ణి జ్ఞానమునకు, వివేకమునకు, వాక్కుకు, బుద్ధికి మరియు అన్ని విద్యలకు దేవుడు. హయగ్రీవ స్వామిని చదువుల యొక్క దేవుడుగా పూజిస్తారువిద్యార్థులు అనుదినం హయగ్రీవ స్తుతి చేస్తుంటే వారు విద్యలో పరిపూర్ణులవుతారు

మంత్రశాస్త్రం ప్రకారం మానవ, జంతు ఆకృతులు కలగలిసిన దేవతలు శీఘ్ర అనుగ్రహ ప్రదాతలు. అటువంటి వారిలో నరసింహస్వామి,శ్రీ హయగ్రీవ స్వామి, వారాహీ అమ్మవారు,గణపతి ముఖ్యులు.

Who is the God of Hayagriva? - Quora

మనకు పురాణాల్లో అనేక అవతారాలు చెప్పబడ్డాయి అందులో విష్ణువు యొక్క 24 అవతారాలలో జ్ఞానఅవతారం శ్రీ హాయగ్రీవ స్వామి. హాయ సీర్షుడు అను రాక్షసుని సంహారం కొరకు గుఱ్ఱము శిరస్సు మానవ దేహము తో స్వామి వారు శ్రావణ పూర్ణిమ రోజున ఆవిర్భావం చెందారు. రాక్షసుని వదించి హాయగ్రీవ స్వరూపము లో బ్రహ్మ కు వేద జ్ఞానం ప్రసాదించారు.

Hayagriva Jayanthi : హయగ్రీవ అవతార విశిష్టత

 దేవాసుర యుద్ధంలో అలసిపోయిన శ్రీ మహావిష్ణువు నారి బిగించి ఉన్న తన ధనుస్సు మీదే గడ్డం ఆనించి గాఢ నిద్రలోకి జారుకున్నాడు. ఆయన్ని నిద్ర లేపడానికి దేవతలు చెదపురుగును సృష్టించి వింటినారిని తినమన్నారు. ‘‘నిద్రాభంగం, భగవత్కథాశ్రవణ విఘ్నం, దంపతులను విడదీయటం, మాతాశిశువులను వేరు చేయడం... బ్రహ్మహత్యాసమానమంటారే. అందునా నీరజాక్షునికా నిద్రాభంగం? మీరెంత స్వార్థపరులు? నన్నీ పాపానికి ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? దీని వల్ల నాకేమిటి ప్రయోజనం?’’ అని పురుగు ప్రశ్నించింది. 

యజ్ఞ హవిస్సులో నీకూ కొంచెం భాగమిస్తామని ఎర చూపగా పురుగు వింటినారిని కొరికింది. అంతే, త్రివిక్రముని తల తెగి ఎక్కడ పడిందో తెలియలేదు. దేవతలు మొండెం మాత్రం చూసి దిగ్ర్భాంతి చెందారు. ‘‘ఏమిటీ దారుణం? ఎవరిదీ మాయ? నిన్ను మించిన మాయ కూడా ఉందా జగత్తులో జగన్నాథా?’’ అని వాపోయారు. బృహస్పతి సలహాతో పరాశక్తిని ప్రార్థించారు. ‘‘దేవతలారా! ఒకప్పుడు వైకుంఠంలో విష్ణుమూర్తి మహాలక్ష్మిని చూచి అదోలా నవ్వగా, ఆమె తమోగుణ విజృంభణంతోనీ తల తెగిపోగాక’’ అని దారుణంగా శపించింది. 

అంతే గాక పూర్వం హయగ్రీవుడనే అసురుడు ఘోర తపస్సు చేసి తనకు మరణం లేకుండా వరం ఇమ్మన్నాడు. అది అసంభవం మరొకటి కోరుకోమనగా తన మరణం తన వల్లనే (హయగ్రీవుని చేతనే) కలగాలని అర్థించాడు. నేను అలాగే అనుగ్రహించాను. కావున, గుఱ్ఱపు తల తెచ్చి విష్ణువు మొండేనికి తగిలించండి.’’ అని పరమేశ్వరి బోధించింది. అలా శ్రీమహావిష్ణువు హయగ్రీవుడై అవతరించి హయగ్రీవాసురుణ్ణి సంహరించాడు. ఆదిశక్తి అనుగ్రహంతో అన్ని విద్యలకు ఆదిదేవుడయ్యాడు. 

అందరం ప్రతినిత్యం చదువుకునే లలితా సహస్రనామాలు కూడా హయగ్రీవుని ద్వారానే వచ్చాయిహాయగ్రీవ స్వామి వారే కంచి క్షేత్రము లో శ్రీ అగస్త్య మహర్షి వారికి అమ్మవారి లీలలు మహత్యము చరిత్ర తెలిపినారు. హాయగ్రీవ అగస్త్య సంవాదము లోనివే శ్రీ లలితా సహస్ర నామాలు హాయగ్రీవ స్వామి వారు కూడా గొప్ప శ్రీ విద్య ఉపాసకుడు అమ్మవారి భక్తుడు. 

ఈయనను నిరంతరం స్మరించే వారికి అపార జ్ఞానం విద్య బుద్ది మేధస్సు కలుగును పిల్లలకు హాయగ్రీవ శ్లోకము అలవాటు చేస్తే బుద్ది బాగా పెరిగి జీవితము లో మంచిగా పైకి వస్తారు అట్టి హాయగ్రీవ స్వామి మన అందరకు కృప చూపు గాక అమ్మవారిని ఉపాసన చెస్ ఎవరికి అయ్యిన హాయగ్రీవ స్వామి కరుణా ఎంతో అవసరం అందరకు "శ్రీహయగ్రీవ కృపా కటాక్ష సిద్ధి రాస్తు".

హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వాదినం | 

నరం ముంచంతి పాపాని దరిద్రమివ యోషితః|| 1 ||

 హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్ | 

తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్మా ప్రవాహవత్|| 2 ||

 హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోధ్వనిః | 

వి శోభతే వైకుంఠ కవాటోద్ఘాటన ధ్వనిః|| 3 ||

 ఫలశ్రుతి :

 శ్లోకత్రయ మిదం దివ్యం హయగ్రీవ పదాంకితం |

 వాదిరాజయత్రిప్రోక్తం పఠతాం సంపదాంప్రదం|| 4 ||

No comments:

Post a Comment

భీమలింగేశ్వర స్వామి వరప్రసాది - గడేకల్ బొబ్బిలి నాగిరెడ్డి

బొబ్బిలి నాగిరెడ్డి గడేకల్ భీమలింగేశ్వర స్వామి వరప్రసాది అని ప్రతీతి. ఈయన భీమలింగేశ్వర స్వామికి చేసిన సేవకి పూజకి స్వామి సంతోషించి పిలిస్తే ...