Saturday 25 July 2020

గొరవన హళ్లి మహాలక్ష్మీ దేవాలయం, తుమకూరు

ప్రాచీన కాలంలో ప్రాంతంలో గొరవన హళ్లి ప్రాంతంలో గోవుల సంఖ్య ఎక్కువగా ఉండేది. అవి చేసే శబ్దాలు ఎక్కువగా ఉండటం వల్ల ప్రాంతానికి గొరవన హళ్లి అని పేరు వచ్చినట్లు చెబుతారు.

ప్రాంతంలో అరసు వంశానికి చెందిన అబ్బయ్య నిత్యం పశువులను మేపుకుంటూ ఉండేవారు. ఒకసారి ఆయన నరసయ్యనపాళ్య గ్రామ సమీపంలోని చెరువు వద్దకు వెళ్లగా తనను ఇంటికి తీసుకు వెళ్లాల్సిందిగా ఒక ఆడస్వరం వినిపించింది.

దీంతో అతను స్వరం వినిపించిన చోటు వెదుకగా విచిత్ర రంగులో మెరిసిపోతున్న ఒక రాతి పలక కనిపింది. దీంతో తన తల్లి అనుమతి తీసుకుని శిలా రూపాన్ని తన ఇంటికి తీసుకువెళ్లి భక్తి శ్రద్ధలతో పూజించాడు.

దీంతో అతడు కొద్దికాలంలోనే ధనవంతుడిగా మారిపోయి తన కుటుంబంతో సుఖంగా జీవించసాగాడు. దీంతో అతని ఇంటికి లక్ష్మీ నివాసం అని పేరు వచ్చింది.

కొన్ని రోజుల తర్వాత అబ్బయ్య తమ్ముడైన తోటప్పయ్య లక్ష్మీ దేవిని పూజించడం మొదలుపెట్టాడు. ఒకరోజు లక్ష్మీ దేవి ఆయన కలలో కనిపించి తనకు గొరవనహళ్లిలో ఒక దేవాలయాన్ని నిర్మించి తన విగ్రహాన్ని అక్కడ పున:ప్రతిష్టించాలని సూచించింది.

దీంతో ఆయన లక్ష్మీ దేవి చెప్పినట్లే చేశారు. కొన్ని రోజుల పాటు దేవాలయంలో ధూప దీప నైవేద్యాలు, నిత్యాన్నదానాలు బాగానే జరిగాయి. అయితే అటు పై ఆలయం ఆలనా పాలనా పట్టించుకునేవారు కరువై పోయారు.

దీంతో ఆలయంలో పూజలు జరగలేదు. నేపథ్యంలో గొరవన హళ్లికి కోడలిగా వచ్చిన కమలమ్మ దేవాలయం స్థితిగతులను చూసి చాలా బాధపడింది. అటు పై ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చుకొని దేవాలయాన్ని ప్రస్తుతం ఉన్న స్థితికి అభివ`ద్ధి చేసింది.

క్రమంగా దేవాలయానికి భక్తుల రాకపోకలు పెరిగాయి. ముఖ్యంగా లక్ష్మీ దేవిని కొలిచిన వారి కష్టాలు తీరి వారు సంపన్నులుగా మారుతూ వచ్చారు.

అంతేకాకుండా పెళ్లికాని అమ్మాయిలు 48 రోజుల పాటు గొరవన హళ్లి లక్ష్మీ దేవిని ఆరాదిస్తే వివాహ యోగం కలుగుతుందని నమ్ముతున్నారు.

దీంతో కేవలం కర్నాటక నుంచే కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఇక్కడకు ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తున్నారు. ముఖ్యంగా మంగళ, శుక్ర, ఆదివారాల్లో ఇక్కడకు ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు.

అంతేకాకుండా ఆషాఢమాసం చివరి శుక్రవారం ఇక్కడ జరిగే చండికా హోమంశ్రావణ శుక్రవారాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి. సమయంలో వేల సంఖ్యలో మహిళా భక్తులు హాజరవుతారు.

ఆలయ నిర్వహణ, భక్తుల సౌకర్యాల కోసం కమలమ్మ మార్గదర్శనంలో ఛారిటబుల్ ట్రస్టును ఏర్పాటు చేశారు. దీంతో ఇక్కడి వచ్చే భక్తులకు వసతి కల్పిస్తున్నారు. ఇక్కడ నిత్యం రెండు పూటలా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది.

తుమకూరు నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న గొరవన హళ్లికి చేరుకోవడానికి తుమకూరు హైవేలోని దాబాస్ పేట మీదుగా రోడ్డు మార్గం చాలా బాగుంది. తుమకూరు నుంచి వచ్చేవారు కొరటగెరె మార్గం ద్వారా ఇక్కడకు చేరుకోవచ్చు.

గొరవనహళ్లికి సమీపంలో చుట్టు పక్కల దేవరాయన దుర్గా, సిద్దర బెట్ట, సిద్ధగంగా, శివ గంగా వంటి ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి.

Locality/village : Goravanahalli
State : Karnataka
Country : India
Nearest City/Town : Koratagere Taluk
Best Season To Visit : All
Languages : Kannada, Hindi & English
Temple Timings : 6:00 AM to 12:30 PM and 5:30 PM to 8:00 PM

శ్రావణమాసం విశిష్టత / విధులు..


పౌర్ణమి నాడు శ్రవణా నక్షత్రం ఉన్న నెలను మనము శ్రావణ మాసం అని జరుపుకుంటాము ఇది చాతుర్మాస్యము లో రెండో నెల ఎన్నో పండుగలు వ్రతాలు పూజలు వెంట తీసుకువచ్చే నెల. “ఈ నెలలో పరమ శివుని కి అఖండ అభిషేకము అఖండ బిల్వ అర్చన నిత్యము శివ నామ సంకీర్తన చేసే వారికి పరమేశ్వరుని అనుగ్రహము వల్ల అఖండ ఐశ్వర్య ప్రాప్తి జ్ఞానప్రాప్తి అంత్యమున శాశ్వత శివ సాయిజ్యము కలుగుతుంది, శ్రావణ సోమవార వ్రతము , శ్రావణ మంగళ వార వ్రతము, శ్రావణ శుక్రవార వ్రతము,శ్రావణ శనివార వ్రతము, నాగుల చవితి , పంచమి పూజ, షష్ఠి సుబ్రహ్మణ్య పూజ, ఏకాదశి ద్వాదశి తిధి లక్ష్మీ నారాయణ పూజ, పౌర్ణమి కి ముందు వచ్చు శుక్రవారం “వర మహా లక్ష్మీ దేవి వ్రతము” , శ్రావణ పౌర్ణమి నాడు వైదిక పండితులకు ఉపాకర్మ, హాయగ్రీవ స్వామి జయంతి, రక్షా బంధన (రాఖీ పండుగ) , శ్రావణ బహుళ అష్టమి కృష్ణాష్టమి ఇలా నెల మొత్తం వ్రతాలు పండుగలు పూజలు మనకు శాస్త్రము నిర్దేశించింది , వరలక్ష్మి వ్రతము గృహస్తులు ఉదయం చేస్తే యతి సన్యాసులు ,పీఠాధిపతులు రాత్రి చేస్తారు భేదం లేకుండా అందరూ చేసుకునే వ్రతము ల్లో ఇది ఒక్కటి చాతుర్మాస్య వ్రతము చేసుకునే పీఠాధిపతులకు ఈ నెల లో సుమంగలి స్త్రీలు ఇచ్చుకునే దానము వారికి ఉండు సౌభాగ్య దోషాలు తొలగించి దీర్ఘ సుమంగలిత్వ ప్రాప్తి అనుగ్రహిస్తుంది , ఇలా ఎన్నో పుణ్యకార్యాలకు నెలవు శ్రావణ మాసం ” ఏ వ్రతాలు చేసే శక్తి లేని వారు కనీసం శివారాధన చేసుకొన్న చాలు ఈశ్వరుడే ఐశ్వర్య ప్రదాత ఐశ్వర్య కారకుడు ” ఇట్లు శ్రీగురుచరణ దాసులు
శ్రీజగద్గురు శంకర దత్తత్రేయ మహాసంస్థాన మఠం , అనంతపురం

శ్రీ చతుర్వింశతి మూర్తి చింతన



నిత్య జీవితము లో మనం చేసే నిత్య పూజ జప ఆది సేవల్లో ఆచమనం తప్పని సరి ఆచమనం లో చెప్పబడే 24 నామాలు 24 రూపలే చతుర్వింశతి మూర్తులు 24 మూర్తులు సమస్త ప్రకృతి శక్తులకు దైవిక శక్తులకు ఆధారము వీరిని స్మరించే సాధకుని అంతః బాహ్య శుద్ది ని ఇచ్చి వాని సాధన లో ముందుకు నడిపిస్తారు ఈరోజు నుండి 24 మూర్తుల యొక్క స్వరూప నామ లక్షణాలు తెలుసుకుందాం

 

1.    శ్రీ కేశవాయ నమః

" కేశవ" ఇందులో కః అన్న శబ్దము బ్రహ్మను , అన్న శబ్దము విష్ణనువును, ఈశా అన్న శబ్దము పరమేశ్వరుని ప్రతిపదిస్తూ ఉంది ఎలా త్రిమూర్తులు తన యందు కల పరబ్రహ్మ స్వరూపమే " కేశవ" స్వరూపము అని విష్ణు పురాణం లో నారద మహర్షి వచనం , అంతే కాకుండా శ్రీ కృష్ణుని బాల్య లీలలో కేశి అను రాక్షసుని సంహారం చేసిన తరువాత నుండి కూడా కేశవ అన్న నామము ప్రాచుర్యం లోనికి వచ్చింది , కేశవ అంటే ఇంకో అర్ధము సుందరమగు కేశములు అనగా వెంట్రుకలు కల వాడు అని అట్టి కేశవుని కి నమస్కరిస్తూ ఈరోజు కు స్వస్తి రేపు ఇంకో నామము తో మళ్ళీ కలుద్దాం.

 

2.    ఓం నారాయణయ నమః

"నారాయణ " అనగా "నారములు" అంటే జీవులు , "ఆయణం" అంటే ఆశ్రమము అనగా సర్వ జీవులకు ఆశ్రయము అయ్యిన వాడు ఆశ్రయముగా కలవాడు అని అర్థము , సమస్త జగత్తు లో లోపల బయట అంతటా వ్యాప్తి అయ్యి ఉన్న పరమాత్మ నే నారాయణుడు , అని " శ్రీ నారాయనోపనిశత్ వచనము , "నారాయణ" అన్న నామ శబ్ద మహత్యము అజామిళుని ఉపఖ్యానము లో విస్తారము గా వివరించబడింది అట్టి శ్రీ నారాయని కి నమస్కారం , రేపు ఇంకొక నామము తో మళ్ళీ కలుద్దాం స్వస్తి ఇట్లు శ్రీ గురు చరణ పాద రేణువులు , శ్రీ మాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః, హరే శ్రీనివాస

3.    ఓం మాధవయ నమః ,

"మాధవ" మా అనగా శ్రీ మహా లక్ష్మీ దేవి మూల ప్రకృతి స్వరూపిణి , ధవ అనగా పతి భర్త దరించువాడు మాధవ అనగా ప్రకృతి ని ధరించు పరమపురుషుడు అని అర్థము , మాధవుని తెలుసుకొను విద్య కు మధు విద్య అని పేరు అట్టి మధు విద్య ద్వారా తెలుసుకోబడే వాడే మాధవుడు , మహాభారతం లో ఉద్యోగ పర్వం లో " మౌనం, ధ్యానం, యోగం వంటి వాటి తో తెలుసుకోబడే వాడే మాధవుడు" అని వేద వ్యాసుని వచనం అట్టి శ్రీ లక్ష్మీ పతి అగు మాదవుని కి మా నమస్కారం , రేపు ఇంకొంక నామము తో మళ్ళీ కలుద్దాం, స్వస్తి, ఇట్లు శ్రీ గురు చరణ పాద దాసులు, శ్రీ దుర్గాయ నమః, శ్రీ గురుభ్యో నమః, హరే శ్రీనివాస

 

4.    ఓం గోవిందాయ నమః ,

"గోవింద గోవిందా" అన్న నామము బహుళ సుప్రసిద్ది చెందిన నామము గో అన్న శబ్దానికి భూమి, గోవు, గోకులం, వాక్కు అన్ని ఎన్నో అర్ధలు ఉన్నాయి , మహాభారతం శాంతి పర్వం లో "పూర్వం హిరణ్యక్షుని వల్ల పాతాళానికి పోయిన భూమి ని ఉద్ధరించిన వాడిని కాబట్టి దేవతలు నన్ను "గోవిందా" అని కీర్తించారు , అలాగే హరి వంశ పురాణం లో ఇంద్రుడు నీవు గోవును గోకులాన్ని కాపడినవు కావును నీవు గోవిందుడవు అని స్తుతించాడు , అదే హరి వంశ పురాణం లో "వాక్కు ని గో అని వ్యవహరిస్తారు అలా అన్ని వాక్కుల్లో వ్యాపించి ఉన్న నీవు గోవిందుడవు అని మునులు స్తుతించారు ఇలా గోవింద అన్న నామము తెలియని వారు లేరు ఉండరు అట్టి గోవిందుని కి నమస్కరిస్తూ రేపు ఇంకొక నామము తో మళ్ళీ కలుద్దాం , స్వస్తి ఇట్లు శ్రీగురుచరణ పాద దాసులు. శ్రీ అంబికా నమోస్తుతే , శ్రీ గురుభ్యో నమః, హరే శ్రీనివాస

 

5.ఓం విష్ణవే నమః


" విష్ణు" అనగా మహా పురుషుని శక్తి చేత సమస్త ప్రపంచము నిలచి ఉన్నదో ఆయనే విష్ణు అని విష్ణు పురాణం, రుగ్వేదం కూడా సంసారం చక్రాన్ని సమాప్తి చేసుకోవాలి అంటే విష్ణు నామాన్ని జపించాలి ఇతరులు జపించని జపించకపోని విష్ణు మేము నిన్ను నిత్యం స్మరించి తరిస్తాము అని తేలిపోయింది అట్టి శ్రీ విష్ణువుకు నమస్కారం , స్వస్తి రేపు ఇంకొక నామము తో మళ్ళీ కలుద్దాం ఇట్లు శ్రీ గురు చరణ పాద దాసులు శ్రీ భవాని నమోస్తుతే, ఓం శ్రీ గురుభ్యో నమః, హరే శ్రీనివాస

 

6.శ్రీ మధుసూదన

పరమేశ్వరుని 24మూర్తుల్లో ఈయన 6 వారు శ్రీమహా విష్ణువు సావర్ణిక మన్వంతరము లో ఆయన యొక్క చెవి నుండి ఉద్బవించిన "మధు కైటభులు" అను రాక్షసులను సంహారం చేసి మధు సుధన నామము తో ప్రసిద్ధిచెందాడు సూధనము అనగా సంహారం అలా వారికి ముక్తి ప్రసాదించన మూర్తి శ్రీమధుసూధన మూర్తి , వైశాఖ మాసము నాకు అది దైవము మధుసూదనుడు , మహాభారతం లో అరణ్యపర్వం లో భీష్మాచార్యులు ఈవిధంగా సెలవిచ్చిరి సర్వ దేవతలు నుతించు శ్రీ హరి బ్రహ్మ ప్రార్ధన మేరకు మధు కైటభులను యోగమాయ ద్వారా హతమార్చి మధు సూధన నామము చేత ప్రసిద్ధి చెందాడు అట్టి శ్రీ మధుసూదన మూర్తి కి శత సహస్ర నమస్కారాలు , రోజుకు స్వస్థి ,రేపు మరొక నామము చింతన చేద్దాం , ఇట్లు శ్రీగురుపాదరేణువులు అస్మదాచార్య గురుభ్యో నమః. శ్రీ కాత్యాయని నమోస్తుతే. హరే శ్రీనివాస

 

7.శ్రీ త్రివిక్రమాయ నమః

సర్వేశ్వరుని వింశతి స్వరూపాల్లో పూర్ణ పరాక్రమ స్వరూపమే శ్రీ త్రివిక్రమ స్వామి త్రివిక్రమ అనగా "త్రి మూడు లోకములు విక్రమ అనగా తన పాద పద్మముల చేత ఆక్రమించిన వాడు " అని హరివంశపురణం శ్రీ హరి తన వామన స్వరూపము లో బలి చక్రవర్తి మీద ఒక పాదము ,ఒక పాదము 14 లోకములు,ఒక పాదము భూమి మీద ఉంచి చూపిన లీలా స్వరూపము శ్రీ త్రివిక్రమ మూర్తి , జేష్ఠ మాసము కు అధి దైవము శ్రీ త్రివిక్రమ స్వామి , రేపు మరొక నామ చింతన తో మళ్ళీ కలుద్దాము, స్వస్థి , ఇట్లు @ శ్రీ గురుచరణ పాద రేణువులు , శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే, అస్మద్ గురుభ్యో నమః, హరే శ్రీనివాస. Note # శ్రీ త్రివిక్రమ స్వామి వారి పేరు మీద ఉన్న క్షేత్రములు 1. తిరుక్కోవిలురు , సుప్రసిద్ద అరుణాచల మహా క్షేత్రానికి 40 కిమి దూరము లో విల్లుపురం అరుణాచలం మధ్యలో ఉంది 2. ఉలగలంద పెరుమాళ్ , శివకంచి శ్రీ కామ కోస్టము శ్రీ కామాక్షి అమ్మవారి దేవాలయం తూర్పు మాడ వీధి లో ఉంది దేవాలయం , 3. సొండా క్షేత్రము , కర్ణాటక ఇది కూడా శ్రీ త్రివిక్రమ మూర్తి కొలుఉన్న క్షేత్రము శ్రీవాది రాజ స్వామి వారి బృందావనము కూడా ఇక్కడ ఉంది

 

8.శ్రీ వామనాయ నమః

సర్వేశ్వరుని 24వింశతి మూర్తుల్లో వామన మూర్తి 8 స్వరూపము "వామన" రూపము దశావతారాలలో 5 స్వరూపము అదితి ,కశ్యప ప్రజాపతి కి పుత్రునిగా వామన మూర్తి జన్మించి బలి దానవుని పాతాళ మునకు పంపిన కధ అందరికి తెలుసు అయితే కఠోపనిషత్తు వామన అన్న నామనికి ఇలా అర్ధము తెలిపింది"హృదయ మధ్యమున నిలచిన సూక్షరూపి (వామన) మూర్తి ని సమస్త దేవతలు ఉపాసిస్తూ ఉన్నారు వామన అనగా పొట్టి వాడు అని కూడా అర్ధము ఇక్కడ పొట్టి వాడు అనగా సూక్షరూపము లో జీవుని లో ఉండు జీవ అంతర్గత మూర్తి అట్టి వామనుడు మనకు తోడు గా ఉండు గాక, రేపు మరొక నామము చింతన తో మళ్ళీ కలుద్దాం,స్వస్థి, ఇట్లు@ శ్రీ గురు చరణ పాద రేణువులు,శ్రీ మాత్రే నమః, అస్మదాచార్య గురువే నమః, హరే శ్రీనివాస. Note తిరుక్కోవిలురు లోని శ్రీ త్రివిక్రమ స్వామి దేవాలయం లో శ్రీ వామన మూర్తి సన్నిధి కలదు

 

9.శ్రీధరాయ నమః

సర్వేశ్వరుని వింశతి మూర్తుల్లో 9 మూర్తి శ్రీధరుడు నామనికి అర్ధము ఏమనగా "శ్రీ" అనగా మూల ప్రకృతి వాచక స్వరూపిణి అగు శ్రీమహాలక్ష్మి అట్టి మూల ప్రకృతి వాచక అగు జగన్మాత ను భరించి ధరించు వాడు కాబట్టి శ్రీ ధర అని పరమాత్మ చెప్పబడుచున్నాడు అట్టి శ్రీధర నామక పరమాత్మ కు మా నమస్కారం , రేపు మరొక నామము తో మళ్ళీ కలుద్దాం ,స్వస్థి ఇట్లు శ్రీ గురుచరణ పాద రేణువులు , శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే 🔥🙏 note @ లక్ష్మీ దేవి అనగా మూల ప్రకృతి తల్లి పరమాత్మ అగు శ్రీహరి ని ఎప్పుడు విడిచిపెట్టదు అందుకే ఆమె నిత్యనుపాయిని లక్ష్మీ అంటే డబ్బు సంపాదన మాత్రం కాదు సకల కల్యాణ గుణ స్వరూపిణి , ఆమె ఎప్పుడు పరమాత్మను వీడక ఉండడము పరమాత్మ కూడా ఎప్పుడూ ఆమెను ధరించి ఉండడం చేత శ్రీధర వచకుని గా ప్రసిద్ధుడు

 

10.హృషీకేశాయ నమః

పరమాత్ముని 24రూపాల్లో 10 స్వరూపము "హృషీకేశ" ఇక్కడ "హృషీకములు" అనగా ఇంద్రియములు ,"ఈశ"అనగా ఇంద్రియములకు అధీశుడు అగు పరమాత్మ అందుకే "ఇంద్రియాదీశ హృషీకేశ" అని భీష్మాచార్యుల వారు మహాభారతము లో భీష్మాచార్యు చేత చెప్పబడ్డ "భీష్మస్థావ రాజము" లో ప్రతిపాదించారు ,అంతకు ముందు ఉపనిషత్తులు కూడా ఇదే తత్వాన్ని ప్రతిపాదించి భగవానుని కీర్తించాయి , సర్వ జీవుల హృదయము లో ఉంది పరమాత్మ అంతర్యామి గానే కాకుండా ఇంద్రియ నియమకడిగా కీర్తించబడుచున్నాడు మన చేత (activeness), అచేతన (inactiveness) రెండు శ్రీ హృషీకేశుని అధీనం అట్టి పరమాత్మ మనపై కృప చూపాలని వేడుకుంటు, రేపు మరొక నామ చింతన తో మళ్ళీ కలుద్దాం, స్వస్థి,ఇట్లు శ్రీగురుచరణ పాద ధూళి దాసులు, శివాయ గురువే నమః శ్రీ మహా సరస్వతి నమోస్తుతే హరే శ్రీనివాస శ్రీ వేంకటేశ

 

11.శ్రీ పద్మనాభాయ నమః

పరమేశ్వరుడు అగు శ్రీ మహావిష్ణువు 24మూర్తుల చింతన లో ఈరోజు 11 రూపము నామము అగు" పద్మనాభ " మూర్తి ని గురించి తెలుసుకుందాం నామనికి విష్ణు పురాణం విధముగా అర్ధము తెలిపింది "పద్మము సృష్టి వికాసానికి అభివృద్ధికి కి ప్రతీక అట్టి వికాసానికి అభివృద్ది కి మూలము అగు విష్ణువు పద్మనాభ అన్న నామము చేత ప్రతిపాదించబడుచున్నాడు" శ్రీ పద్మనాభుడి యొక్క నాభి పద్మము నుండి బ్రహ్మ ఆవిర్భావం జరిగింది , బ్రహ్మ సృష్టి ని సర్వేశ్వరుని ఆజ్ఞ చేత రచన చేసాడు అన్నది శాస్త్రం , పద్మనాభ అన్న జాతి కి చెందిన నాగులు దేవలోక నాగులు గా పూజింపబడుచున్నాయి శ్రీపద్మనాభ స్వామి వారి కృప ఉన్న వారికి దరిద్రము ,అప్పులు,పాప కర్మలు దూరము అయ్యి సుఖశాంతులు పొందగలరు భాద్రపద శుద్ధ చతుర్దశినాడు పద్మనాభుని ఉద్దేశించి "అనంతవ్రతము" చేయడము సంప్రదాయం ,సుప్రసిద్ధ పద్మనాభ స్వామి క్షేత్రము "తిరు అనంతపురం" కేరళ రాష్ట్రము లో కలదు అందరికి స్వామి కృప కలగాలని వేడుకొంటు ఈరోజు కు స్వస్తి , రేపు మరొక నామ చింతన తో మల్లికలుద్దాం , ఇట్లు శ్రీగురుచరణ ధూళి దాసులు అస్మద్ గురుభ్యో నమః , శివ శివ శ్రీ అన్నపూర్ణ నమోస్తుతే హరే శ్రీనివాస

 

12.శ్రీ దామోదర

పరమేశ్వరుడు అగు శ్రీ హరి యొక్క 24 తత్వమూర్తుల్లో 12 మూర్తి "శ్రీ దామోదర " మూర్తి బ్రహ్మ వైవర్త పురాణం నామనికి విధంగా అర్ధము చెప్పింది "దామము అనగా ఉదరం అట్టి ఉదరం లో సమస్త లోకాలు కలవాడు కాబట్టి శ్రీ హరి దామోదర శబ్దము చేత ప్రతిపాదించబడి వాడు అగుచున్నాడు" అంతే కాక బాల కృష్ణుడు చేసే అల్లరి భరించలేక అమ్మ యశోదా శ్రీ కృష్ణుని ఒక రోకలి కి బంధించి వెళుతుంది అప్పుడు శ్రీ కృష్ణుడు , నారదుల వారి శాప కారణము గా మద్ది చెట్లు గా పడి ఉన్న కుబేరుని కొడుకులు అగు నల కుబేర , మని భద్ర లు ఇద్దరికి శాప విముక్తి ఇచ్చి అనుగ్రహించిన లీల "దామోదర లీల" గా ప్రసిద్ధము దామోదర అంటే ఉదరం (కడుపు) కు బంధము కలవాడు అని కూడా ఇంకో అర్ధము అలా స్వామి దామోదర నామము తో ప్రసిద్ధి కార్తిక్ మాసము కు "దామోదర" మాసము అని పేరు సుమంగలి స్త్రీ మూర్తులు "తులసి దామోదర " వివాహము చేయించడము కూడా అనాది వస్తున్న సంప్రదాయం 🙏ఈరోజు కు నామ చింతన తో స్వస్తి , రేపు మరొక నామ చింతన చేత మళ్ళీ కలుద్దాం , అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం , శివాయ గురువే నమః , శ్రీ గాయత్రీ నమోస్తుతే, హరేశ్రీనివాస

 

13.శ్రీ సంకర్షణాయా నమః

24మూర్తుల్లో 13 నామము స్వరూపము "శ్రీ సంకర్షణ" శబ్ద ఉవాచ్యుడు " సర్వ జీవులను తన వైపు తిప్పుకుని ఆకర్శించు వాడు సర్వ ఆకర్షకుడు అని , ప్రళయము లో సర్వ జీవులను నశింప చేయువాడు కాబట్టి పరమాత్మ "సంకర్షణ" నామము చేత ప్రసిద్ధము , శ్రీ రుద్ర అధ్యాయం లో ప్రారంభం లో కూడా "సంకర్షణ" మూర్తి స్వరూప అని చెబుతుంది ఆది శేషుడే "సంకర్షణ మూర్తి" ఆయనే జగన్నాథ పూరీ క్షేత్రము లో "బల రాముని" గా కొలువున్నాడు ఈయనే ద్వాపరయుగంలో రోహిణి గర్భం లో " బల రాముని" గా జన్మించాడు సంకర్షణ మూర్తి పాతాళ లోకానికి అధిపతి , బలి చక్రవర్తి, సుదర్శన మూర్తి తో కూడి పాతాళ లోకము లో ఈయన కొలువై ఉంటాడు సమస్త నాగులు, సర్పాలు సంకర్షణ మూర్తి అధీనము లో ఉంటారు ,విష్ణు తత్వము లో ఉండే చతుర్ వ్యూహ మూర్తుల్లో సంకర్షణ మూర్తి కూడా ఒకడు ,స్వస్థి, అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరామ్ శివాయ బ్రహ్మణే నమః , శ్రీ గాయత్రీ సావిత్రీ సరస్వతి బ్రహ్మ రూప హరే శ్రీనివాస🙏రేపు మరొక నామ చింతన తో మళ్ళీ కలుద్దాం

 

14.శ్రీ వాసుదేవాయ నమః

24 మూర్తుల్లో ఈయన 14 నామము రూపము కు ప్రతిపాద్యము నామానికి విష్ణుపురణం విధముగా అర్ధము చెప్పింది"సర్వ భూతముల యందు వసించు వాడు కాబట్టి వాసుదేవుడు అని పరమాత్మ తెలియబడుచున్నాడు , వసుదేవుని కుమారుడు గా జన్మించాడు కాబట్టి స్వామి "వాసుదేవుడు" వైష్ణవ తత్వము లో చెప్పబడే వ్యూహ మూర్తుల్లో వాసుదేవుడు కూడా ఒకడు ,శ్రీరంగము లో పర వాసుదేవుని మనం చూడవచ్చు అట్టి వాసుదేవుని కి నమస్కరిస్తూ ఈరోజు నామ చింతన స్వస్తి ,రేపు మరొక నామ చింతన తో మళ్ళీ కలుద్దాం , అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరం పరాం శివో గురు శ్రీ భద్రకాళీ నమోస్తుతే శ్రీహరే శ్రీనివాస

 

15.శ్రీ ప్రద్యుమ్నాయా నమః

సర్వేశ్వరుని 24రూపాల్లో 14 స్వరూపము నామము "శ్రీ ప్రద్యుమ్నాయా నమః" నామనికి విష్ణు పురాణము విధముగా అర్ధము చెప్పింది "పరమాత్మ సమస్త ఆధ్యాత్మిక భౌతిక సంపదలకు ఆధారము కాబట్టి ఆయన "ప్రద్యుమ్న" అన్న శబ్దము చేత చెప్పబడుచున్నాడు ప్రద్యుమ్న మూర్తి వైష్ణవ వ్యూహ మూర్తుల్లో ఒకరు , అనంత రూపాల్లో నామాల్లో ఉండు పరమాత్మ కు నమస్కారం , రోజుకు స్వస్తి , అస్మదాచార్య పర్యంతాం వందే శ్రీ గురు పరాం శివో బ్రహ్మ శివో గురు శ్రీమహిషాసుర మర్ధని నమోస్తుతే హరే శ్రీనివాస

 

15.శ్రీ అనిరుద్ధయా నమః

పరమాత్మ 24 మూర్తుల్లో 15మూర్తి నామము "అనిరుద్ధ" నామనికి విష్ణు పురాణము విధముగా అర్ధము చెప్పింది "నిగ్రహించలేని పరాక్రమం కల వాడు కాబట్టి పరమాత్మ అనిరుద్ధ శబ్ద పతిపద్యుడు "అపరాజిత"అన్న నామనికి ఇది పర్యాయ పాదము ,మహా విష్ణువు యొక్క 4లుగు వ్యూహాల్లో అనిరుద్ధ వ్యూహము చివరిది , అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం శివో బ్రహ్మ, శ్రీకాత్యాయని నమోస్తుతే , హరే శ్రీనివాస

 

16.శ్రీ పురుషోత్తమాయ నమః

పరమాత్ముని 24మూర్తి చింతన లో 16 స్వరూపము మూర్తి "శ్రీ పురుషోత్తమ" అన్న శబ్ద ప్రతి పాద్యుడు నామనికి భగవద్గీత 15 అధ్యాయం 18 శ్లోకము లో ఇలా వివరించారు స్వయంగా శ్రీకృష్ణుడు "నేను క్షరములు అనగా సర్వ జీవులు మరియు అక్షరము అనగా మూల ప్రకృతి ని జయించిన వాడిని వీటికి ఆధారము అయిన వాడిని కావున వేదాలు నన్ను పురుషోత్తమ అన్ని కీర్తించాయి , జగన్నాథపూరీ క్షేత్రము లో జగన్నాథ స్వామి కూడా పురుషోత్తముడు విష్ణుకంచి లోని వరదరాజ స్వామి కూడా పురుషోత్తమ అన్న పేరు తో పూజలు అందుకుంటున్నాడు తెలుగు నాట శ్రీ తాళ్ళపాక అన్నమ్మచార్యులు శ్రీ వెంకటేశ్వర స్వాముల వారిని "పొడ గంటి మయ్యా మిము పురుషోత్తమ " అంటూ కీర్తించారు , శ్రీ రామచంద్ర మూర్తి మర్యాద పురుషోత్తముడు శ్రీ కృష్ణుడు మాయా పురుషోత్తముడు అట్టి పురుషోత్తమునికి నమస్కరిస్తూ . అస్మదాచార్య పర్యంతం వందే శ్రీగురు పరంపరాం, శివో గురు తల్లి జగదాంబ శ్రీ త్రిపుర సుందరి నమోస్తూ, హరే శ్రీనివాస

 

17.శ్రీ అధోక్షజ

పరమాత్ముని24రూపాల్లో నామాల్లో 17రూపం నామం "శ్రీ అధోక్షజ" మహాభారతం ఉత్తరపర్వము లో నామ మహత్యము ఇలా చెప్పబడింది "తన పూర్వ స్థితి నుండి ఎప్పుడు దిగజారని వాడు అనగా ఎప్పుడు నాశనం లేని వాడు , అంతరిక్షంము =అక్ష ,భూమి=అధ , రెండింటికి మధ్య వ్యాపించి ఉండు వాడు లేదా విరాట్ రూపములో రెండిటి మధ్య ఆవిర్భావం చెందు వాడు (వామన అవతారం లో జరిగిన లీల), "" అన్న శబ్దము లో ఇంద్రియ శక్తులను జయించిన వాడు , ఇంద్రియములు జయించిన వారిచే చూడబడు వాడు (కోరికలను జయించిన యోగుల చేత చూడబడు వాడు) కాబట్టి పరమాత్మ " అధోక్షజ" అన్న నామము చేత ప్రతి పాద్యుడు , అస్మదాచార్య పర్యంతం వందే శ్రీగురు పరం పరాం ఓం నమో భగవతే శ్రీ రుద్రాయ శ్రీ భ్రమరాంబ దేవి నమోస్తూతే. హరే శ్రీనివాస

అచ్యుత అనంత గోవింద గోవిందా శ్రీ నరసింహ నరసింహ నరసింహ

18.శ్రీ నార సింహాయ నమః

పరమాత్ముని 24స్వరూపాల్లో తత్వాల్లో 18రూప నామము మన అందరికి బాగా సుపరిచితము అగు "శ్రీ నార సింహ" భాగవతము, విష్ణు పురాణం, నరసింహ పురాణం ఇలా ఎన్నో శాస్త్రాలు నామాన్ని ఏంతో గొప్పగా వివరించాయి "నరుల్లో ఉండే దుష్ట మృగ ప్రవుత్తి ని తొలగించేందుకు పరమాత్మ నర+సింహ శరీరము తో భక్త ప్రహ్లాదుని రక్షణ కొరకు హిరణ్యకశిపుని సంహారం కొరకు ప్రదోషావేల స్తంభము నుండి ఆవిర్భావం చెందారు ,భగవద్గీత లో కూడా "విభూతి యోగము" లో స్వామి తాను మృగాల్లో "సింహము" అని తెలిపినారు "సింహం", అనగా "హింసించు వానిని హింసించు నది" అలా స్వామి భక్తులను హింసించు వానిని హింసిస్తాడు కావున ఆయన "నర సింహ" శబ్ద ప్రతిపాద్యుడు మన భారత దేశము లో నర సింహ స్వామి కి సంబంధించిన ఎన్నో క్షేత్రాలు ఉన్నాయి , సింహము శక్తి,ప్రక్రమము, అధికారము,విజయము,ధైర్యము ,బలము కు ప్రతీక అమ్మవారి కి కూడా సింహము వాహనము అట్టి నర హరి మనలను నిత్యము కాపాడు గాక 🦁రేపు 19 నామము అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరాం శ్రీ బ్రహ్మీ నమోస్తూ శ్రీలక్ష్మి నృసింహ మమ దేహి కరావలంబమ్

 

19.శ్రీ అచ్యుతాయ నమః

పరమాత్మ యొక్క 24 స్వరూపాల్లో నామాల్లో 19 స్వరూపము నామము "అచ్యుత" దీన్ని ఉపశత్తులు ఇలా వివరించాను "చ్యుతి అనగా నాశనం అట్టి నాశనం మార్పు లేని సర్వ కారణ ప్రేరణ చైతన్యం " పుట్టుక మొదలు మరణము వరకు ఉండు ఎట్టి అవస్థలు వికారాలు లేని వాడు కాబట్టి ఆయన అచ్యుత శబ్ద ప్రతిపాద్యుడు "శాశ్వతం శివం అచ్యుతం" అని పురుష సూక్తము అట్టి శ్రీ అచ్యుతునికి మా నమస్కారం రేపు 20 నామము అస్మదాచార్య పర్యంతాం వందే శ్రీగురు పరం పరాం శ్రీ వృషభ వాహన రూఢ మహేశ్వరీ నమోస్తూ , హరే శ్రీనివాస

 

21.శ్రీ జనార్ధన

పరమాత్మ ధరించిన 24లీలా రూపాల్లో 21స్వరూపము నామము "శ్రీ జనార్దన" నామానికి విష్ణుపురాణము విధముగా అర్ధము చెప్పింది "జనులు లేదా జీవులు కోరు అర్ధములు అనగా ధర్మ,అర్ధ, కామ,మోక్ష అను సమస్తము ప్రసాదించు వాడు కావున పరమాత్మ జనార్దన శబ్ద ప్రతిపాద్యుడు" జనమేజయుడు ప్రతిష్ట చేసిన 1008 విష్ణు దేవాలయాల్లో ఎన్నో చోట్ల మనకు జనార్దన స్వామి దర్శనము ఇస్తాడు ,అస్మదాచార్య పర్యంతం వందే శ్రీ గురు పరంపరాం మయుర వాహన రూఢ కౌమారి గరుడ వాహన రూఢ వైష్ణవి నమోస్తుతే , హరే శ్రీనివాస

 

22.శ్రీ ఉపేంద్రాయ నమః

పరమాత్మ యొక్క 24రూపాల్లో తత్వాల్లో 22 రూపము నామము "శ్రీ ఉపేంద్ర" నామనికి "హరివంశపురాణం" అర్ధము ఇలా తెలిపింది "అదితి దేవి మాఘ మాసము లో పాడ్యమి మొదలు ద్వాదశి వరకు వాసుదేవుని పుత్రుని గా పొందుట కొరకు "పయో వ్రతము" ఆచరించి బలి దానవుని నుండి ఇంద్రునకు ముక్తి కొరకు ఆయన్ను తన పుత్రుని గా పొందినది "ఇంద్రునికి తమ్ముడు గా స్వామి రావడం ఆయన లీల అందుకే ఆయన "ఉప" "ఇంద్ర" ఉపేంద్ర , "ఇంద్రుని రక్షించుటకు వచ్చిన వాడు కావున "ఉపేంద్ర" శబ్ద ప్రతిపాద్యుడు శ్రీ హరి , ఇప్పటికి మాఘ మాసము లో పాపముక్తి కొరకు , పయో వ్రతము ఆచరించడం సంప్రదాయం , ఉపేంద్ర వామన త్రివిక్రమ ఇవి ఒకే లీలకు సంబంధించిన ఒకే పరమాత్మ ధరించిన భిన్న రూపాలు రేపు 23 నామము. అస్మదాచార్య పర్యంతాం వందే శ్రీగురు పరంపరాం మహిషా రూఢ వారాహి , ఐరావత రూఢ ఇంద్రాణి మాతృక నమోస్తుతే నమో భగవతే శ్రీ రుద్రాయ హరే శ్రీనివాస

 

23.శ్రీ హరి

పరమాత్మ యొక్క 24లీల తత్వమూర్తుల్లో 23 నామము రూపము "శ్రీ హరి" దీనికి విష్ణుధర్మోత్తరపురాణం విధముగా అర్ధము తెలిపింది ."హరి అనగా హరియించు వాడు అని తనను స్మరించు వారి పాప తాప కర్మలను హరించి వారిని పవిత్రులుగా చేయు వాడు" జీవుల సంసారం బంధాన్ని హరించు వాడు " అంతేకాక సర్వ జీవుల్లో అంతర్యామి గా ఉండే వాడు అంతరాత్మ గా ఉండే వాడు కావున ఆయన "హరి"అను శబ్దముచేత ప్రతిపాద్యుడు "హరి నామము కడు ఆనంద కరము" "అస్మదాచార్య పర్యంతం వందే శ్రీగురుపరంపరాం" "సింహ రూఢ శ్రీ చాముండా , భేతాల రూఢ శివధూతి మాతృకా నమోస్తుతే , హరే శ్రీనివాస

 

24.శ్రీకృష్ణ

పరమాత్మ యొక్క 24తత్వస్వరూపముల్లో చివరిది "శ్రీకృష్ణ" స్వరూపము నామము కృషుని గురించి ఎంత చెప్పిన చెప్పుకున్న తక్కువే " వేద వ్యాసుడు తన భాగవతము లో "శ్రీ కృష్ణస్తు భగవాన్ స్వయం" అన్నారు అనగా కృష్ణుడు అవతారము కాదు స్వయముగా పరమాత్మ " మహాభారతం, విష్ణు పురాణం,నృసింహ ,వరాహ, వామన,స్కంద,బ్రహ్మవైవర్త ఆది పురాణాల్లో ప్రస్తావించబద్ద స్వరూపము కృష్ణ స్వరూపము క్రిష్ అన్న ధాతువు నుండి కృష్ణ అన్న శబ్దము పుట్టిందని శాస్త్రము"కృష్ణుడు అంటే తనను స్మరించే వారిని సర్వ విధములుగా తన వైపు ఆకర్షించి వారి పాపాలు హరించి శాశ్వత ఆనందాన్ని ప్రసాదించే వాడు" అన్ని సంప్రదాయాల వారు ఆరాధించే పూర్ణ పరబ్రహ్మ పరమేశ్వరుడు కృష్ణుడు , కృష్ణుడు అంటే ఇష్ట పడని వారు ఎవరు ఉండరు అంతటి మన మోహన మూర్తి మన దేశములో శ్రీ కృష్ణుని చిత్రపటం లేని ఇల్లు లేదు ఉండదు అంతటి గొప్పవాడు కృష్ణుడు , అంతటి గొప్పది కృష్ణ నామము , శ్రీ కృష్ణుడే ప్రధాన దైవము గా మన దేశములో ఎన్నో క్షేత్రాలు ఉన్నాయి " ద్వారకా,జగన్నాథ పూరీ, మధుర,బృందావనం, ఉడిపి, పండరీ పూర్, గురువాయుర్,తిరువాలిక్కిని తిరుపతి,తిరుచానూరు, తిరుమల ఇలా ఎన్నో రేపల్లె లోని గోపాలుడు మన అందరి ఇళ్లలో ఉన్న మన గోపాలుడు , ఏమి రాకున్నా ఏమి తెలియకున్న కృష్ణ కృష్ణ కృష్ణా కృష్ణా అనుకున్న చాలు తరించిపోతాము 24 రూపాల్లో కూడా దశ అవతార స్వరూపాలు నామాలు ఉన్నాయి అవి ఏవి తత్వ రూప పరంగా ఒక్కటే ఒకే పరమాత్మ ధరించు భిన్న రూపాలు భిన్న నామాలు ఇది సాధకులు ఎప్పుడు గుర్తుంచుకోవాలి🙏 శ్రీగురు విద్యా నృసింహ భారతీ స్వామి వారి కృప వల్ల శ్రీ భ్రమరాంబా మహాదేవి కృపవల్ల ఈరోజు కు 24మూర్తుల గురించి క్లుప్త వివరం శ్రీజగద్గురు ఆది శంకరులు రాసిన "విష్ణు సహస్రనామ భాష్యం" ఆధారంగా పూర్తి అయినది రేపు మూర్తుల తో ఉండు "శ్రీ మహాలక్ష్మీ మూర్తుల గురించి తెలుసుకుందాం"సర్వం శ్రీ గురు శ్రీ పరమేశ్వరి పరమేశ్వరుల కృప" హరే శ్రీనివాస హరే రామ హరే కృష్ణ

శ్రీజగద్గురు శంకర దత్తత్రేయ మహాసంస్థాన మఠం , అనంతపురం

 

 

భీమలింగేశ్వర స్వామి వరప్రసాది - గడేకల్ బొబ్బిలి నాగిరెడ్డి

బొబ్బిలి నాగిరెడ్డి గడేకల్ భీమలింగేశ్వర స్వామి వరప్రసాది అని ప్రతీతి. ఈయన భీమలింగేశ్వర స్వామికి చేసిన సేవకి పూజకి స్వామి సంతోషించి పిలిస్తే ...