Sunday 30 August 2020

బాలా త్రిపుర సుందరి - భజన పాట

బాలా త్రిపుర సుందరి - భజన పాట

 పల్లవి :

సుందరి…..త్రిపుర సుందరి…..
సుందరి…..త్రిపుర సుందరి…..

బాలా త్రిపుర సుందరి గైకొనుమ హారతి
బాలా త్రిపుర సుందరి గైకొనుమ హారతి

గానలోల జాలమెలా దారి చూపుమా...
గానలోల జాలమెలా దారి చూపుమా...

బాలా త్రిపుర సుందరి గైకొనుమ హారతి
గానలోల జాలమెలా దారి చూపుమా...

చరణం :
సుందరాంగి అందరు నీ సాటిరారుగా - సుందరాంగి అందరు నీ సాటిరారుగా
సందేహములు అందముగా తీర్పుమంటిని - సందేహములు అందముగా తీర్పుమంటిని

బాలా త్రిపుర సుందరి గైకొనుమ హారతి - బాలా త్రిపుర సుందరి గైకొనుమ హారతి
గానలోల జాలమెలా దారి చూపుమా... గానలోల జాలమెలా దారి చూపుమా...

వాసికెక్కి యున్న దానవనుచు నమ్మితి -వాసికెక్కి యున్న దానవనుచు నమ్మితి
రాసిగ సిరి సంపదలిచ్చి  బ్రోవుమంటిని - రాసిగ సిరి సంపదలిచ్చి  బ్రోవుమంటిని

బాలా త్రిపుర సుందరి గైకొనుమ హారతి - బాలా త్రిపుర సుందరి గైకొనుమ హారతి
గానలోల జాలమెలా దారి చూపుమా... గానలోల జాలమెలా దారి చూపుమా...

ఓం  హ్రీం  శ్రీం యనచు  మదిని తలచుచుంటిని - ఓం  హ్రీం  శ్రీం యనచు  మదిని తలచుచుంటిని
ఆపద లెడ బాపవమ్మ అతివ సుందరి - ఆపద లెడ బాపవమ్మ అతివ సుందరి

బాలా త్రిపుర సుందరి గైకొనుమ హారతి - బాలా త్రిపుర సుందరి గైకొనుమ హారతి
గానలోల జాలమెలా దారి చూపుమా... గానలోల జాలమెలా దారి చూపుమా...

స్థిరముగ శ్రీకడలి యందు వెలసితివమ్మా - స్థిరముగ శ్రీకడలి యందు వెలసితివమ్మా
ధరణిలో శ్రీరంగదాసుని దయను చూడుమా - ధరణిలో శ్రీరంగదాసుని దయను చూడుమా

బాలా త్రిపుర సుందరి గైకొనుమ హారతి
బాలా త్రిపుర సుందరి గైకొనుమ హారతి
గానలోల జాలమెలా దారి చూపుమా...
గానలోల…...గానలోల……
గానలోల జాలమెలా దారి చూపుమా.
దారి చూపుమా…..దారి చూపుమా.
దారి చూపుమా………..

రచన : ప్రయాగ రంగ దాసు గారు
స్వర రచన : బాల మురళి క్రిష్ణ గారు




Saturday 22 August 2020

లలితాసహస్రనామాంతర్గతం - మహాగణేషోద్భవం

         

   కామేశ్వరముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరా
                మహాగణేశనిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితా|      

 


భీమలింగేశ్వర స్వామి వరప్రసాది - గడేకల్ బొబ్బిలి నాగిరెడ్డి

బొబ్బిలి నాగిరెడ్డి గడేకల్ భీమలింగేశ్వర స్వామి వరప్రసాది అని ప్రతీతి. ఈయన భీమలింగేశ్వర స్వామికి చేసిన సేవకి పూజకి స్వామి సంతోషించి పిలిస్తే ...