మేడమార్యుడు
కులోత్తుంగదేవుడి కుమారుడగు వీరచోడదేవుడి వద్ద సైన్యాధిపతిగా ఉండెను. ఇతనికి
వేములవాడ భీమకవి స్వయంగా “రాజ రాజ బ్రహ్మ మహా రాజ” అని బిరుదు ఇచ్చారు. ఇతను వేదవేదాంగవేదియైన
ఉత్తమద్విజుడు. ధనుర్వేదమును కూడా అభ్యసించాడు. భుజబలపరాక్రముడు. రాజనీతివేత్త కూడా.
అందుకే వీరచోడదేవుడితనిని తన సైన్యాధిపతిగా నియమించాడు. ఇతను కూడా ఆ కాలమున
ఏయుద్ధానికి వెళ్ళాల్సివచ్చినా, భీమకవి
వద్దకు వచ్చి, ఆయన ఆశీర్వాదమును తీసుకొని వెళ్ళేవాడు. అందువలన ఈతను ఏ
యుద్ధానికేగిననూ విజయమే తప్ప పరాజయము కలుగలేదు. వెళ్ళిన ప్రతి యుద్ధములో విజయముతో
తిరిగిరావడం వల్ల వీరచోడదేవుడిని మేడమర్యుడు ఎంతో అభిమానించేవాడు. వీరచోడదేవుడు, మేడమర్యుని “రాజ రాజ బ్రహ్మ మహా
రాజ” అనే పిలిచేవాడు. తను కూడా “ నాకీ బిరుదు భీమకవి ఇచ్చినదని” గొప్పగా
చెప్పుకొనేవాడు. ఇతడు భీమకవిని ఎంతో భక్తి విశ్వాసాలతో సేవించాడు. భీమకవి వద్ద
ధర్మోపదేశం ప్రకారం, తన బంధువులపట్ల ఎంతో గౌరవాభిమానాలు చూపుతూ, పేదవారయిన
సన్మార్గులకు దానధర్మాలను చేస్తూ, తన జీవితమంతా భీమకవి సేవకే వదిలివేసాడు. అంతేకాక
పిఠాపురము, ద్రాక్షారామాల్లో భీమకవి పేరిట సత్రములను కూడా కట్టించాడు. అక్కడ
నిత్యాన్నదానములను చేయించాడు. చెల్లూరులో వైష్ణవాలయమును కట్టించి, ఒక కోనేరును
త్రవ్వించి కర్తృత్వమును భీమకవి ఇచ్చివేసాడు.
Subscribe to:
Posts (Atom)
భీమలింగేశ్వర స్వామి వరప్రసాది - గడేకల్ బొబ్బిలి నాగిరెడ్డి
బొబ్బిలి నాగిరెడ్డి గడేకల్ భీమలింగేశ్వర స్వామి వరప్రసాది అని ప్రతీతి. ఈయన భీమలింగేశ్వర స్వామికి చేసిన సేవకి పూజకి స్వామి సంతోషించి పిలిస్తే ...
-
సత్యజ్ఞానానందరూపా సామరస్య పరాయణా | కపర్దినీ కలామలా కామధుక్కామ రూపిణీ ||151|| సత్యజ్ఞానానందరూపా సామరస్య పరాయణా: కపర్దినీ: కలామలా: కామధుక్:...
-
ప్రతీ దేవతకీ మంత్రం ఉన్నట్లే ధ్యానశ్లోకం ఉంటుంది. ఆ ధ్యానశ్లోకం ఆ దేవతారూపాన్ని తెలుపుతుంది. దేవతా రాధనలో ధ్యానశ్లోకముతో ఆ దేవత ను ఏక...
-
స్వామివారి ఆలయమునకు ముందు భాగమున గొప్పశిలతో నిర్మింపబడిన ఒక ధ్వజస్తంభమును నిలిపినారు. దీనిని నిలబెట్టుటకు ఆ రోజుల్లో యంత...
No comments:
Post a Comment