·
శ్రీనాథుడు తన “కాశీఖండం”లో తన పూర్వపు కవులను
స్తుతిస్తూ, మొదటగా భీమకవి ఉద్దండ శైలిని గుర్తుకుతెచ్చుకున్నాడు.
“
వచియింతు వేములవాడ భీమన భంగిఁ
నుద్దండలీల
నొక్కొక్క మాటు
భాషింతు
నన్నయభట్టుమార్గంబున
నుభయభాషాప్రౌఢి
నొక్కమాటు”
·
పట్టపు సరస్వతీ సోమయాజి (సాక్షాత్తు భీమేశ్వరుడు
భీమకవి నాలుక చివర వాగ్భామిని బీజాక్షరాలను లిఖించాడని)
భీమేశ్వరు
డితడు మా నామము వాడనుచు వ్రాసి
నాలుకతుద
వాగ్భామిని బీజాక్షర మా భీమన
దలచినను
గల వభీష్టఫలంబుల్ (పృథుచరితము)
·
తిరువేంగళ కవి తన “చొక్కనాథచరిత్ర” గ్రంథములో
తెలుగు కవులను స్తుతిస్తూ భీమకవి ని తొలుత తలచి తరువాత కవిత్రయాన్ని తలచాడు.
“ భవభూతి
దండుమాఘునిని బిరుద వేములవాడ భీము,
నన్నయ తిక్కన
ఎఱ్ఱపార్య శ్రీనాథునిలఁగల్గు కవులను నెల్ల
సద్భక్తి
విలసిత సద్వాక్య వినుతి నుతించియెకతి రచియింప”
·
కొరవి గోపరాజు అను కవి భీమకవిని (బలభీముడు, వినుత
భీముడు) గూర్చి
“వేములవాడక
సుఖియై
వేములవాడం
జరించి వేములవాడన్
దా
మెరసిన భీముని సుత
భీముని
బలభీము విముఖతభీముదలంతున్”
·
ఆంధ్రకవి రామయ్య (భీమకవి ఛందోనిబంధన చాతురీ
ధోరేయుడని, వాగ్ధాముడనీ)
“ఛందోనిబంధన చాతురీధోరేయు వాగ్దాము
వేములవాడ భీమ”
“చను
నుత్తమగండాధ,ర్వణహనుమదనంతన కవిరాక్షనజయదే
వనుత
శ్రీధరగోక,ర్ణనీలకంఠాది భీమన చ్ఛందంబుల్”
·
వెల్లంకి తాతంభట్టు (భీమకవి లక్షణకర్త)
“భీమన
అఖండంబు మొదలైన కొన్ని వళులకు
లక్షణ
లక్ష్యంబులు చెప్పడు”
ప్రజ్ఞాలవదుర్విదగ్దు
లసంగతంబుగా బెనచి
తగిలించినా;
రతని యంకితంబు లేవున
వానిం
బ్రమాణింపతగదు”
·
చంద్రరేఖావిలాప రచయిత కూచిమంచి జగ్గకవి (తిట్టు
కవిత్వం అనగా అందులో భీమకవి అగ్రగణ్యుడని చెప్పాలని)
భీమకవి రామలింగని
స్త్రీ మన్మధుడై
చెలఁగు శ్రీనాధకవిన్
రాముకవి ముఖులను
ర్రొ
ద్ధామగతిఁ జిత్తువీధిఁదలచి కడంకన్
·
పెదపాటి సోమనాథుడు రచించిన అరుణాచలపురాణంలో
భీమకవిని ఇలా తలచాడు.
వాక్ప్రతోషితదక్షవాటి మహాస్థాన
భీము వేములవాడ భీముఁగొలిచి
·
మొల్ల
స్తుతగుణోద్ధాము నాచనసోము భీముని
·
పింగళి సూరన్న భీమకవి రచించిన రాఘపాండవీయం అను
రెండర్థముల కావ్యం దొరకకపోవడం వలన అలాంటి కావ్యమును అదే పేరున రచించాడు. ఆ
గ్రంథములో మొదటి పద్యాన ఇదే విషయాన్ని ఇలా
వ్రాశాడు.
ఉ భీమన తొల్లి చెప్పెనను పెద్దల మాటయె
కాని యందునొం;
డేమియు నేయెడ న్నిలుచు టెవ్వరు గాన రటుండనిమ్ము నా,
నామహిత ప్రబంధరచనా ఘనవిశ్రుతి నీకుఁ గల్గుటన్,
నామదిఁ
దద్ద్వయార్థ కృతి నైపుణియుం గల దంచు నెంచెదన్
·
చిత్రకవి పెద్దన (భీమకవి ఈశ్వరప్రసాది
కవితాడ్యుడని)
ప్రత్ర్యక్ష వర ప్రసాదకవితాడ్యుని
వేములవాడభీమునిన్
·
లింగముగుంట తిమ్మన
భీమనయు
ననంతయును బెద్దనయును
తాతానయును
జెప్పినట్టి ఛందములు గూర్చి
ప్రకరణము
లొప్పజేసెను బ్రహ్మసంఖ్య
నొనర
లింగముగుంట తిమ్మన యనుకవి
·
పొత్తపి వెంకట రమణ కవి
భీముని
ఫణబంధపేశలంబు
·
వార్తకవి రాఘవయ్య
“జనతతగణయుతము
సంపత్కరంబుగా
మంచి
దనుచు భీము డెంచినాడు”
“ఛందం
మొదలనే వేములవాడ భీమ
కవిగారి
ప్రయోగం ఉన్నది”
·
కాకునూరి అప్పకవి
“వికటకవులు
కొన్ని వింతలు గల్పించి
కవిజనాశ్రయమున
గలిపినారు. వాని గఒకొనంగ
వలదప్రయుక్తంబు
లేల సెప్పు భీముడెరిగి యెరిగి”
“
కవిజనాశ్రయమున
‘శ్రీకాంతా’
యని వేములవాడ భీమకవియును”
“భీమన
పది చెప్పె ననం
తామాత్యుడు
చెప్పె వెనుక యతు లిరువదినాల్గు”
·
ఓరుగంటి రామకవి
భీమేశ్వర
లబ్ధకవితావాచా సిద్ధిగల వేములవాడ
భీమనార్యుం
డొనరించిన కవిజనాశ్రయం
బను
ఛందంబు (కవితాలక్షణసారం)
·
కూచిమంచి తిమ్మకవి
భీమన చెప్పిన
పదియతులను ప్రకారాంతమున వ్రాసుకోన్న పద్యమే ఉంది.
·
కస్తూరి రంగకవి
ఆదిమకవి భీమన రేచన
మీద నంకితముగా జెప్పినాడు.
·
పిండిప్రోలు లక్ష్మణకవి
పృథు
కుకవి స్వాంభీము భీము దలచి
·
కట్టమూర్తి కామేశ్వరకవి
రమణీయపాకాభీరాము
భీము దలచి
·
శేషధర్మము లక్ష్మణకవిస్తుతి
భీము ననంతు
జిత్రకవి పెద్దన సుధీంద్రు జగత్ప్రసిద్ధులన్
·
అనంతామాత్యుడు తన భోజరాజీయము అను కావ్యమునందు
నన్నయభట్టుఁదిక్కనకవి నాచనసోముని
భీమనార్యుఁ బే
రెన్నిక జిమ్మపూడియమరేశ్వర భాస్కర
శంభుదాసునిన్
నన్నుతిఁజేసివాక్య సరసత్వము
వీనులకింపు మీర న
త్యున్నతిగా నొనర్తు నెఱ యోధులమేలనఁ గావుమిమ్ములన్
No comments:
Post a Comment