Saturday 22 August 2020

శ్రీ భూవరహస్వామి దేవాలయం, కల్లహల్లి,కర్ణాటక

మెల్కోటెకి 42 కిలోమీటర్ల దూరంలో మాండ్య జిల్లాలోని కల్హల్లి అనే చిన్న గ్రామంలో శ్రీ భూవరహస్వామి దేవాలయం హేమవతి నది ఒడ్డున ఉంది. విష్ణువు యొక్క మూడవ అవతారం వరాహ స్వామి విగ్రహం 18 అడుగుల ఎత్తు మరియు బూడిద రాయితో తయారు చేయబడింది. వరాహ స్వామి కుడిచేతిలో సుదర్శన్చక్రం, ఎడమతొడ మీద భూదేవీ ఆసీనులై కూర్చొని దర్శనమిస్తున్నది. 

ఈ నదీ ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల ఈ నదిలో ఈత కొట్టడం,  పుణ్యస్నానాలు చేయడానికి అవకాశం ఉండదు. వర్షా కాలంలో ఈ నదిలోని నీరు ఆలయం గోడకు చేరుకుంటుంది. ఏప్రిల్ మరియు మేలో నీరు తగ్గిన తరువాత వార్షిక ఉత్సవాలు జరుగుతాయి.

భూవరాహస్వామి ఆలయం 2500 సంవత్సరాలకు పైగా ఉంది. స్థలపురాణం ప్రకారం, ఈ ఆలయంలో గౌతమ మహర్షి తపస్సు చేశాడని చెపుతారు. ఈ దేవాలయానికి రాజ వీర్ బాలాల గురించి ఒక పురాణ కథ ఉంది. వేట కోసం రాజు అడవికి వెళ్ళిన సమయంలో విశ్రాంతి కొరకు ఒక చెట్టు క్రింద పడుకున్నాడు. అలా విశ్రాంతి తీసుకుంటన్న సమయంలో అక్కడ ఒక వింత దృశ్యాన్ని గమనించాడు. ఒక కుక్క చిన్న కుందేలును తరుముకుని రావడం చూశాడు. మరి కొద్ది సేపటికి కుందేలు కుక్కను తరుముకునిపోవడం  గమనించాడు.

అప్పుడు ఆ రాజు ఈ ప్రదేశంలో కొన్ని మాంత్రిక శక్తులను కలిగి ఉందని విశ్వసించాడు మరియు ఈ ప్రదేశంలో 16 అడుగుల లోతు తవ్వి చూడగా  అక్కడ వరాహస్వామి విగ్రహం దాగి ఉండటాన్ని కనుగొన్నాడు. 

ఈ సంఘటన తరువాత, ఈ రాజు అక్కడ వరహాస్వామి ఆలయాన్ని నిర్మించి ప్రతీ రోజు పూజలు చేయడం ప్రారంభించాడు.




Saturday 8 August 2020

గజేంద్ర స్తుతి: గజేంద్రుని దీనాలాపములు (Gajendra moksham)



పృథుశక్తిన్ గజ మా జలగ్రహముతోఁ బెక్కేండ్లు పోరాడిసం

శిథిలంబైతన లావు వైరిబలముం జింతించిమిథ్యామనో

రథమిం కేటికిదీని గెల్వ సరి పోరం జాలరా దంచు 

వ్యథమై యిట్లనుఁ బూర్వపుణ్యఫల దివ్యజ్ఞాన సంపత్తితోన్.

గజరాజు గొప్పబలంతో అనేక సంవత్సరాలు యుద్ధం జేసి చేసి చివరికి చితికిపోయాడు.తన సత్తువ శత్రువు బలం సరిపోల్చుకొని ఆలోచించుకొన్నాడు “అనవసర ప్రయత్నాలు నాకు ఎందుకుదీనిని జయించటంసరిసమంగా పోరాడటం రెండు నాకు సాధ్యంకాదు.”అని దుఃఖించాడుపూర్వజన్మల పుణ్య ఫలం వలన కలిగిన మేలైన ఙ్ఞానం వల్ల అతడు. విధంగా అనుకోసాగేడు.

 

" రూపంబున దీని గెల్తునిటమీఁ దేవేల్పుఁ జింతింతునె

వ్వారిం జీరుదునెవ్వరడ్డమిఁక ని వ్వారిప్రచారోత్తమున్

వారింపం దగువార లెవ్వరఖిలవ్యాపార పారాయణుల్

లేరేమ్రొక్కెద దిక్కుమాలిన మొఱాలింపం బ్రపుణ్యాత్మకుల్.

 మొసలిని  విధంగా జయించగలనుఇకపై నేను ఏదేవుణ్ణి ప్రార్థించనుఎవరిని పిలవాలిఎవరు నన్ను రక్షిస్తారు మహామొసలిని ఆపేశక్తి కలవారు ఎవరుసర్వకార్యాలలో దిట్టలు గొప్పపుణ్యాత్ములు దిక్కులేని నా మొర వినేవారు లేకపోతారాఅట్టి వారికిమొరపెట్టుకుంటాను.

 

నానానేకపయూధముల్ వనములోనం బెద్దకాలంబు 

న్మానింపన్ దశలక్షకోటి కరిణీనాథుండనై యుండి 

ద్ధానాంభః పరిపుష్ట చందన లతాంతచ్ఛాయలం దుండ లే

కీ నీరాశ నిటేల వచ్చితిభయం బెట్లోకదే యీశ్వరా!

చాలాకాలం నుంచి అడవిలో ఎన్నో ఏనుగు గుంపుల గౌరవాన్ని పొందుతు ఉన్నానుపదిలక్షలకోట్ల ఆడ ఏనుగులకు నాథుడుగా ఉన్నానునా దానజలధారలతో బలంగా పెరిగిన మంచి గంధంచెట్ల నీడలలో సుఖంగా ఉండకుండనీటిమీద ఆశతో ఇక్కడకి ఎందుకు వచ్చానుభగవంతుడాచాలా భయం వేస్తోందిఎలానో ఏమిటో.

 

ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై;

యెవ్వని యందు డిందుఁబరమేశ్వరుఁ డెవ్వఁడుమూలకారణం

బెవ్వఁడనాదిమధ్యలయుఁ డెవ్వఁడుసర్వముఁ దానయైన వాఁ

డెవ్వఁడువాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్.

 లోకమంతా ఎవరి వల్లనైతే పుడుతుందోఎవరిలో కలిసి ఉంటుందో;ఎవరి లోపల లయం అయిపోతుందోఎవరు పరమాత్ముడోఎవరు సృష్టికి ప్రధానకారణమై ఉన్నాడోఎవరైతే పుట్టడంగిట్టడంవాటి మధ్య అవస్థలు లేని శాశ్వతుడోతుదిమొదలు మధ్య లేని అనంతుడోఎవరైతే సమస్తమైన సృష్టి తానే అయ్యి ఉంటాడోఅటువంటి స్వయంభువుప్రభువు ఐన భగవంతుణ్ణి నే శరణు కోరుతున్నాను.

 

ఒకపరి జగములు వెలి నిడి

యొకపరి లోపలికిఁ గొనుచు నుభయముఁ దానై

సకలార్థ సాక్షి యగు 

య్యకలంకుని నాత్మమూలు నర్థిఁ దలంతున్.

ఒకసారి లోకాలను సృష్టి చేసిఇంకొకసారి తనలో లయం చేసుకుంటు లోకాలు రెండు తానే అయ్యిఅన్ని విషయాలను సాక్షీభూతంగా ఆలోకిస్తూఆత్మలకు ఆత్మ అయిన  పరమాత్మను ఆసక్తితో ధ్యానం చేస్తాను.

 

లోకంబులు లోకేశులు

లోకస్థులుఁ దెగినఁ దుది నలోకం బగు పెం

జీకటి కవ్వల నెవ్వం

డేకాకృతి వెలుఁగు నతని నే సేవింతున్.

లోకాలులోకాలను పాలించేవారులోకాలలో ఉండేవారు అందరు నశించిన అనంతరం కారు చీకట్లకు ఆవతల అఖండమైన రూపంతో ప్రకాశించే  దేవుణ్ణి నేను సేవిస్తాను.

 

నర్తకుని భంగిఁ బెక్కగు

మూర్తులతో నెవ్వఁ డాడుమునులు దివిజులుం

గీర్తింప నేరరెవ్వని

వర్తన మొరు లెఱుఁగరట్టివాని నుతింతున్.

అనేక వేషాలు వేసే నటుడి లాగ పెక్కు రూపాలతో ఎవరు క్రీడిస్తుంటాడోఋషులు దేవతలు ఎవరి గొప్పదనాన్ని వర్ణించ లేరోఎవరి ప్రవర్తన ఇతరులకు అగోచరంగా ఉంటుందోఅట్టి  మహాదేవుణ్ణి నేను సంస్తుతిస్తాను.

 

ముక్తసంగులైన మునులు దిదృక్షులు

సర్వభూత హితులు సాధుచిత్తు

లసదృశవ్రతాఢ్యులై కొల్తు రెవ్వని

దివ్యపదము వాఁడు దిక్కు నాకు.

ప్రపంచంతో సర్వ సంబంధాలు వదలివేసిన మునులుభగవద్దర్శనం కోరేవారుసమస్తమైన జీవుల మేలు కోరేవారుమంచి మనసు కలవారు సాటిలేని వ్రతాలు ధరించి ఎవరి పాదాలను సేవిస్తారో అట్టి భగవంతుడు నాకు దిక్కు అగు గాక.

 

భవము దోషంబు రూపంబుఁ గర్మంబు నా-

  హ్వయమును గుణము లెవ్వనికి లేక

జగములఁ గలిగించు సమయించు కొఱకునై-

  నిజమాయ నెవ్వఁ డిన్నియునుఁ దాల్చు

నా పరేశునకుననంతశక్తికిబ్రహ్మ-

  కిద్ధరూపికిరూపహీనునకునుఁ,

జిత్రచారునికిసాక్షికినాత్మరుచికినిఁ-

  బరమాత్మునకుఁబరబ్రహ్మమునకు,


మాటలను నెఱుకల మనములఁ జేరంగఁ

గాని శుచికిసత్త్వగమ్యుఁ డగుచు

నిపుణుఁ డైనవాని నిష్కర్మతకు మెచ్చు

వాని కే నొనర్తు వందనములు.

భగవంతుడికి పుట్టుకపాపముఆకారంకర్మలునామాలుగుణాలు లేవుఅతడులోకాలను పుట్టించడానికినశింపజేయడానికి తన మాయా ప్రభవంతో ఇవన్నీ ధరిస్తాడు.అతడు పరమేశ్వరుడుఅంతులేని శక్తి కలవాడుబ్రహ్మనిండైన రూపం గలవాడు రూపం లేనివాడుచిత్రమైన ప్రవర్తన కల వాడుసర్వసాక్షిఆత్మప్రకాశ మైన వాడుపరమాత్మపరబ్రహ్మమాటలకు ఊహలకు అందని వాడుపరిశుద్ధుడుసత్వగుణంతో దరిజేర దగినవాడు మరియు నేర్పరులు చేసే ఫలాపేక్ష లేని కర్మలను మెచ్చువాడు అయినట్టి  దేవదేవునికి నేను నమస్కారాలు చేస్తాను.

 

శాంతున కపవర్గ సౌఖ్య సంవేదికి-

  నిర్వాణ భర్తకు నిర్విశేషు

నకుఘోరునకు గూఢునకు గుణధర్మికి-

  సౌమ్యున కధిక విజ్ఞాన మయున

కఖిలేంద్రియద్రష్ట కధ్యక్షునకు బహు-

  క్షేత్రజ్ఞునకు దయాసింధుమతికి

మూలప్రకృతి కాత్మ మూలున కఖిలేంద్రి-

   జ్ఞాపకునకు దుఃఖాంత కృతికి

నెఱి నసత్య మనెడి నీడతో వెలుఁగుచు

నుండు నెక్కటికిమహోత్తరునకు,

నిఖిల కారణునకునిష్కారణునకు 

మస్కరింతు నన్ను మనుచు కొఱకు.

భగవంతుడు శాంతస్వరూపుడు. పరలోక సౌఖ్యప్రదాత. మోక్షానికి అధిపతి. నిర్విశేషుడు. దుష్టులకు భయంకరుడు. సంసారబద్దులకు అందనివాడు. సర్వ గుణ ధర్మాలు కలవాడు. సరళ స్వభావి. విశేషమైన ఙ్ఞానము కలవాడు. సర్వేంద్రియాల కార్యాలను చూసేవాడు. సమస్తానికి ప్రభువు. బహు క్షేత్రఙ్ఞుడు. దయారసానికి సముద్రం వంటివాడు. సర్వానికి ఆది మూల పురుషుడు. ఆత్మకు ఆధారమైనవాడు. సకల ఇంద్రియాలకు నియామకుడు. దుఃఖాన్ని తొలగించేవాడు. మాయ అనే నీడతో ప్రకాశించే బహు నేర్పరి. మిక్కిలి గొప్పవాడు. సమస్తానికి ఆది బీజం అయినవాడు. తనకి మూల కారణం ఏది లేనివాడు. అట్టి ఆ దేవ దేవునికి నన్ను కాపాడ మంటూ నమస్కరిస్తున్నాను.

 

యోగాగ్ని దగ్ధకర్ములు

యోగీశ్వరు లే మహాత్ము నొం డెఱుఁగక 

ద్యోగ విభాసిత మనముల

బాగుగ వీక్షింతు రట్టి పరము భజింతున్.

యోగీంద్రులు యోగం అనే అగ్నితో తమ సర్వ పూర్వ కర్మలను కాల్చివేసిఇతరమైనది మరేది తలచకుండ ప్రకాశించే తమ మనసులలో  దేవదేవుని చూస్తు ఉంటారుఅట్టి  మహానుభావుడిని నేను సేవిస్తాను.

 

సర్వాగమామ్నాయ జలధికినపవర్గ-

  మయునికినుత్తమ మందిరునకు,

సకలగుణారణిచ్ఛన్న బోధాగ్నికిఁ-

  దనయంత రాజిల్లు ధన్యమతికి,

గుణలయోద్దీపిత గురు మానసునకుసం-

  వర్తితకర్మనిర్వర్తితునకు,

దిశ లేని నా బోఁటి పశువుల పాపంబు-

  లడఁచువానికిసమస్తాంతరాత్ముఁ

డై వెలుంగువానికచ్ఛిన్నునకుభగ

వంతునకుఁదనూజ పశు నివేశ

దారసక్తు లయినవారి కందఁగరాని

వాని కాచరింతు వందనములు.

పరమేశ్వరుడు సమస్త ఆగమాలు వేదాలు అనే నదులకు సంగమరూప మైన సముద్రము వంటివాడుమోక్షస్వరూపుడుగొప్ప గుణాలకు నిలయ మైన వాడుఆరణి కొయ్యలలోని అగ్నివలె సుగుణాలలో దాగి ఉండేవాడుస్వయం ప్రకాశకుడుగొప్ప మనస్సు కలవాడుప్రళయాన్ని సృష్టిని నడిపేవాడునాలాంటి  దిక్కులేని జీవుల పాపాలను శమింపజేసేవాడుసర్వులలోను ఆత్మ యై వెలగువాడునాశనం లేనివాడుపూజింప దగినవాడుభార్యా పుత్రులు ఇల్లు పశువులు వంటి వాటి యందు ఆసక్తి కలవారికి అందరానివాడుఅటువంటి ప్రభువునకు నమస్కారాలు చేస్తాను.

 

వరధర్మకామార్థ వర్జితకాములై;-

  విబుధు లెవ్వాని సేవించి యిష్ట

గతిఁ బొందుదురుచేరి కాంక్షించువారి ;-

  వ్యయ దేహ మిచ్చు నెవ్వాడు కరుణ?

ముక్తాత్ము లెవ్వని మునుకొని చింతింతు?-

  రానందవార్ధి మగ్నాంతరంగు

లేకాంతు లెవ్వని నేమియుఁ గోరక-

  భద్రచరిత్రంబుఁ బాడుచుందు?

రా మహేశునాద్యునవ్యక్తునధ్యాత్మ

యోగగమ్యుఁబూర్ణునున్నతాత్ము,

బ్రహ్మమయిన వానిఁబరునినతీంద్రియు,

నీశుస్థూలుసూక్ష్ము నే భజింతు."

ఇంతేకాకుండా, దేవదేవుడు ధర్మం కామం ధనం అన్నిటి మీద ఆశలు విడిచేసిన పండితుల పూజ లందుకొని వారు కోరుకొన్న ఉత్తమ వరాలు ప్రసాదిస్తాడు. భక్తితో దరిజేరి కోరిన వారికి దయతో నాశనంలేని శరీరాన్ని ఇస్తాడు. ఆనంద సాగరంలో మునిగిన మనస్సులు కల ఏకాంతిక ముక్తులు ఆ దేవదేవుని అనునిత్యం ఆరాధిస్తారు. వారు దేవదేవుని పవిత్ర మైన చరిత్రను కోరికలేమి లేకుండ కీర్తిస్తుంటారు. ఆ మహా దేవుడు సృష్టికన్న ఆద్యుడు. ఇంద్రియ ఙ్ఞానానికి అందనివాడు, అధ్యాత్మ యోగం వలన చేరదగినవాడు. పరిపూర్ణుడు. మహాత్ముడు. బ్రహ్మస్వరూపుడు. సర్వానికి పరమైనవాడు. ఇంద్రియములకు అతీతమైనవాడు. స్థూలస్వరూపుడు, సూక్ష్మ రూపుడు. అట్టువంటి ఆ పరాత్పరుని నేను సేవిస్తాను.


"పావకుండర్చుల, భానుండు దీప్తుల-

 నెబ్భంగి నిగిడింతు, రెట్ల డంతు

రా క్రియ నాత్మకరావళిచేత బ్ర-

 హ్మాదుల, వేల్పుల, నఖిలజంతు

గణముల, జగముల, ఘన నామ రూప భే-

 దములతో మెఱయించి తగ నడంచు,

నెవ్వఁడు మనము బుద్ధీంద్రియంబులుఁ దాన-

 యై, గుణ సంప్రవాహంబు నెఱపు,

స్త్రీ నపుంసక పురుష మూర్తియునుఁ గాక,

తిర్య గమర నరాది మూర్తియునుఁ గాక,

కర్మ గుణ భేద  దసత్ప్రకాశిఁ గాక,

వెనుక నన్నియుఁ దా నగు విభుఁ దలంతు.

అగ్ని మంటలనుసూర్యుడు వెలుగుని ప్రసరింజేసి మళ్ళీ శమింపజేసే విధంగానే భగవంతుడు తన కిరణాలచేత బ్రహ్మదేవుడు మొదలైన దేవత లనుసకల జీవరాసులనుసమస్త లోకాలను నానా విధాలైన నామ రూప భేదాలతో సృష్టించి లయింపజేస్తాడుఆయన మనస్సుబుద్ధిఇంద్రియాలు అన్నీ తానే అయ్యి గుణాలను ప్రవర్తింప జేస్తాడుఆయన స్త్రీపురుషనపుంసకజంతుదేవతలనరులు మొదలగు వారిలో వేటి ఒక్క రూపము కలవాడు కాదుఆయన కర్మ గుణ భేదాలకి సత్తు అసత్తులకి అతీతుడుఅంతే కాకుండా అవన్ని కూడ తానే అయ్యి ఉంటాడుఅటువంటి  ప్రభువును నేను స్మరిస్తాను.

 

కలఁ డందురు దీనుల యెడఁ,

గలఁ డందురు పరమయోగి గణముల పాలం,

గలఁ డందు రన్నిదిశలను,

గలఁడు కలం డనెడి వాఁడు గలఁడో లేఁడో?

దేవుడు ఆర్తు లైన వారి వెంట ఉంటాడు అని అంటారుఉత్తము లైన యోగుల చెంతఉంటా డని అంటారుఅన్ని దిక్కుల లోను ఉంటా డంటారు. “ఉన్నాడు ఉన్నాడు” అనే దేవుడు మరి ఉన్నాడోలేడో!

 

కలుగఁడే నాపాలికలిమి సందేహింపఁ-

  గలిమిలేములు లేకఁ గలుగువాఁడు?

నా కడ్డపడ రాఁడె నలి నసాధువులచేఁ-

  బడిన సాధుల కడ్డపడెడువాఁడు?

చూడఁడే నా పాటుఁ జూపులఁ జూడకఁ-

  జూచువారలఁ గృపఁ జూచువాఁడు?

లీలతో నా మొఱాలింపఁడే మొఱఁగుల-

  మొఱ లెఱుంగుచుఁ దన్ను మొఱగువాఁడు?

అఖిల రూపముల్ దనరూప మైనవాఁడు

ఆదిమధ్యాంతములు లేక యడరువాఁడు

భక్తజనముల దీనుల పాలివాఁడు

వినఁడెచూడఁడెతలఁపడెవేగ రాఁడె?

నా విషయంలో  భగవంతుడు గురించి అనుమానించాల్సిన పని లేదుఅతడు ఐశ్వర్యంపేదరికం లాంటివి చూడకుండా అందరికి అండగా ఉంటాడుకాబట్టి నాకు అండగా ఉంటాడుదుర్జనుల చేతిలో చిక్కుకున్న సజ్జనులకు సాయపడతాడుఅందువల్ల నాకు సాయం చేస్తాడుబయటి చూపుల వదిలిపెట్టి తననే చూసేవారిని దయతో చూస్తాడు.కనుక నా కష్టాన్ని చూస్తాడుదీనుల మొరలు విని తన్ను తానే మరచి పోతాడు కదానామొర తప్పక వింటాడుఅన్ని రూపాలు ఆయన రూపాలేమొదలు నడుమ తుద అన్నవి ఆయనకు లేవుభక్తులకు దిక్కులేని వారికి ఆయనే ఆధారంమరి అటువంటి ప్రభువు ఇంకా నా మొర వినడేంనా బాధ చూడడేంనన్ను దయ చూడడేంతొందరగా రాడేం?

 

విశ్వకరు విశ్వదూరుని

విశ్వాత్ముని విశ్వవేద్యు విశ్వు నవిశ్వున్

శాశ్వతు నజు బ్రహ్మప్రభు

నీశ్వరునిం బరమపురుషు నే భజియింతున్."

ప్రభువు లోకాన్ని సృష్టించేవాడులోకులు అందుకోలేని వాడులోకానికి అంతరాత్మఅయిన వాడులోకంలో బాగా తెలుసుకోదగిన వాడు లోకమే తానైన వాడులోకాతీతుడుఎల్లప్పుడు ఉండేవాడుపుట్టుక లేనివాడుబ్రహ్మదేవునికి అధినాయకుడులోకాన్ని నడిపించేవాడుపరమాత్మఅట్టి ఆది పురుషుని నేను ఆరాధిస్తాను.

 

"లా వొక్కింతయు లేదు; ధైర్యము విలోలంబయ్యె; బ్రాణంబులున్

ఠావుల్ దప్పెను; మూర్ఛ వచ్ఛెఁ; దనువున్ డస్సెన్; శ్రమంబయ్యెడిన్;

నీవే తప్ప నితఃపరం బెఱుఁగ; మన్నింపందగున్ దీనునిన్;

రావే! యీశ్వర! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా!

దేవా! నాలో శక్తి కొంచం కూడ లేదు. ధైర్యం సడలి పోయింది. ప్రాణాలు కూడ కదలిపోతున్నాయి. మూర్చ వచ్చేస్తూ ఉంది. శరీరం స్రుక్కిపోయింది. బాగా అలసటగా ఉంది. నాకు నీవు తప్ప వేరే ఇతరు లెవ్వరు నాకు తెలియదు. నీవే దిక్కు. ఆర్తితో ఉన్న నన్ను ఆదుకోవయ్య. ఓ స్వామీ! రావయ్యా! కరుణించు, వరాలిచ్చే ప్రభూ! కాపాడు, పుణ్యాత్ముడా!

 

విను దఁట జీవుల మాటలు

చను దఁట చనరానిచోట్ల శరణార్థుల కో

యను దఁట పిలిచిన సర్వముఁ

గను దఁట సందేహ మయ్యెఁ గరుణావార్ధీ!

 దయాసాగరానీవు సర్వ ప్రాణుల పిలుపులు వింటావటవారిపై దయ చూపడానికి పోరాని చోట్లకు ఐనా పోతావటశరణన్న వారికి వెంటనే ఓయ్ అని అంటావుటకాని ఇప్పుడు ఇదంతా సత్యమేనా అని అనుమానంగా ఉంది.


 కమలాప్తయో వరదయో ప్రతిపక్షవిపక్షదూరకు

య్యోకవియోగివంద్యసుగుణోత్తమయో శరణాగతామరా

నోకహయో మునీశ్వర మనోహరయో విమలప్రభావరా

వేకరుణింపవేతలఁపవేశరణార్థిని నన్నుగావవే!"

  కమలాక్షుడా వరాలు ఇచ్చే ప్రభూశత్రువులపై కూడ వైరం లేనివాడాపండితులచే నమస్కారాలు అందుకొనే వాడాఉత్తమ సుగుణాలు కలవాడాశరణు కోరువారికి కల్పవృక్షం వంటివాడామునీంద్రులకు ప్రియమైనవాడానిర్మలమైన మహిమ కల వాడానా మొర వినువెంటనే రాకనికరించుకరుణించి శరణు వేడుతున్న నన్నుకాపాడు.


అని పలికి మఱియు "నరక్షిత రక్షకుండైన యీశ్వరుం డాపన్నుఁడైన నన్నుఁ గాచుఁ 

గాక" యని నింగి నిక్కి చూచుచు, నిట్టూర్పులు నిగడించుచు, బయ లాలకించుచు 

నగ్గజేంద్రుండు మొఱచేయుచున్న సమయంబున.

ఇలా ప్రార్థించి “రక్షణ లేనివారిని రక్షించే  భగవంతుడు నన్ను కాపాడుగాక!” అని గజరాజు మొరపెట్టుకొన్నాడుఆకాశం వైపు నిక్కి నిట్టూర్చాడుఆకాశానికి చెవులు అప్పజెప్పి ఆక్రోశించాడు సమయంలో


భీమలింగేశ్వర స్వామి వరప్రసాది - గడేకల్ బొబ్బిలి నాగిరెడ్డి

బొబ్బిలి నాగిరెడ్డి గడేకల్ భీమలింగేశ్వర స్వామి వరప్రసాది అని ప్రతీతి. ఈయన భీమలింగేశ్వర స్వామికి చేసిన సేవకి పూజకి స్వామి సంతోషించి పిలిస్తే ...