భీమకవి ఒకనాడు
రాయనమంత్రి భాస్కరుని ఇంటికి వెళ్ళారు.
చరిత్రలో ఎంతో మంది రాయనమంత్రి భాస్కరుని పేరు కలవాళ్లు ఉన్నారు, కానీ ఈ భాస్కరుడు
భీమకవి కాలంనాటి భాస్కరుడు. ఇతను తిక్కన సోమయాజికి తాత. భీమకవి బంధువులలో ఒకడు.
ఇతను రాజేంద్రచోడునికి మంత్రిగాను, దండినాధునిగాను పనిచేసేవాడు. భీమకవి రాయనమంత్రి
భాస్కరుని ఇంటికి వెళ్ళినపుడు తనకు ఒక గుర్రమును ఇవ్వమని అడిగారు. అయితే
రాయనమంత్రి ఆలోచనలోపడి ఎంతసేపటికీ తన అంగీకారము తెలుపలేదు.
అపుడు భీమకవి
క వగమాన్పి యర్థికియ్యని
మగముండకు
మీసమేల మఱి మూతిపయి
దెగఁ
గొఱుగడాయె మంగలి
రగడందునఁ
గీర్తిదోచ రాయని బాచా!
భావం: సంఘంలో ఎంతో పేరు మోసిన ఓ రాయనబాచా! సహాయం కోరివచ్చిన
వాడి కష్టాన్ని తీర్చని మగవాడు విధవతో సమానం. అటువంటి వాడికి మరి మూతిపయిన మీసము
దేనికి? మీకు మంగలి సరీగా గొరుగుతున్నట్లు
లేదు.
అని
చెప్పగానే భాస్కరుడు “నువ్వు చెప్పినది సత్యమే. కానీ నేను నీకు ఎటువంటి
గుర్రాన్నిస్తే బాగుంటుందా అని ఆలోచనలోపడి ఇంత వరకూ కాలయాపన చేసినందుకు నేను మీసము
గొరిగించుకోవాల్సిందే” అని చెబుతూ భీమకవిని తన అశ్వశాలకు తీసుకువెళ్ళాడు. తన వద్ద
ఉన్న అన్ని అశ్వాలను చూపించి, వీటిలో ఏది కావాలో, ఎన్ని కావాలో తీసుకొమ్మని
చెప్పాడు. భీమకవి ఒక గుర్రమే చాలని, కవిరాక్షసునికి అనుకూలముగా ఉండునని
నల్లగుర్రమును తీసుకున్నారు. తరువాత అతను భీమకవిని తన ఇంటికి తీసుకువెళ్ళి విందు
భోజనం పెట్టి విశేష ద్రవ్యమునిచ్చాడు. గోదానము మంచిదని తన వద్ద ఉన్న మంచి మంచి
పాడియావులను నూరింటిని భీమకవికి బహుమతిగా ఇవ్వబోగా, ఇన్నిటిని తానేమి చేసుకోనని
భీమకవి రెండు ఆవులను తీసుకున్నారు. ఇంకా ఏమైనా కావాలా నాయనా? అని భాస్కరుడు అడగగా
భీమకవి
క చేకొని రాయన బాచడు
కాకాలు గుణించు
పిన్నకాలము నాడే
లా
కేత్వమియ్యఁజాలడు
దాకునుగొమ్మియ్యఁ
డిట్టిధన్యులు గలరే?
భావము:
రాయన బాచడు చిన్నవయస్సులో కాకాలు (అక్షరాలు) దిద్దేనాడే ‘లా’ కు ఏత్వమును (అంటే లే
అన్న అక్షరమును) దిద్దలేదు. ‘దా’ అనే అక్షరానికి కొమ్మునూ (అంటే దు అన్న అక్షరము)
దిద్దలేదు. ఇటువంటి ధన్యులు ఉన్నారా? అంటే “లేదు” అను మాటను తన చిన్న కాలమునాడు
అక్షరాలలో దిద్దనేలేదు. ఏనాడు అప్రయత్నంగా కూడా తననోటి నుంచి లేదు అన్న మాట రాదు.
ఆ మాటను ఊహ తెలియని వయసునుంచే దూరం పెట్టాడు, అంత దాన గుణము కలవాడని అర్థము.
క ఏవ్రాలైననువ్రాయును
నావ్రాయడు
వ్రాసెనేని నవ్వుచునైనన్
సీ
వ్రాసి తావడియ్యడు
భావజ్ఞుడురాయనార్య
భాస్కరుడెలమిన్
భావము:
ఏ “వ్రా” లైనా వ్రాస్తాడు, కానీ పరిహాసముకు కూడా “నా” వ్రాయడు ఆంటే. సీ వ్రాసి
“తా”కు వత్తు ఇయ్యడు. అంటే “ స్తి” అని, "నాస్తి(లేదు)" అన్న మాట తన నోటివెంట రాదు అని అర్థం. ఈ జగతిలో ఎంతో
దానగుణం కలిగిన వాడు మన రాయన భాస్కరుడు.
భీమకవి
రాయనభాస్కరుడు చేసిన దానధర్మాలను తెలుపుతూ, అతనిని పొగుడుతూ చాలా పద్యాలను
రచించారు. (ఈ పుస్తకం చివరి భాగాన ఇవ్వబడ్డాయి). రాయనభాస్కరుడు తాను చేసిన
సత్కార్యాలు నుంచి, ఎటువంటి కీర్తిని ఆశించని వాడని భీమకవి ఈ క్రింది పద్యములో
చెప్పారు.
ఉ ఒక్కడు మంసమిచ్చె మఱియొక్కడు
చర్మముఁగోసియిచ్చెవే
ఱొక్కరుడస్తినిచ్చె
నిఁకనొక్కడు ప్రాణములిచ్చె వీరిలో
నొక్కొక
పట్టునన్ బ్రదుకనోపకయిచ్చిరో? కీర్తికిచ్చిరో
చక్కగఁజూడు
మంత్రికులసంభవ! రాయనమంత్రి భాస్కరా!
భావము: ఒకరు(శిబి చక్రవర్తి) తన మాంసమునే దానముగా ఇచ్చారు.
మరొకరు తన చర్మము కోసి దానముగా చేసారు. వేరొకరు(దధీచి) తన అస్తిక(వెన్నెముక)నే
దానముగా ఇచ్చారు. ఇంకోరు తన ప్రాణములనే(బలి చక్రవర్తి) దానముగా ఇచ్చారు. వీరిలో
ఒక్కొక్క సందర్భంలో బ్రతుక ఇష్టం లేక ఇచ్చారో? లేదా కీర్తి కోసము ఇచ్చారో? ఆలోచించు
మంత్రికులమున పుట్టిన రాయనమంత్రి భాస్కరా! (రాయనభాస్కరుడు అటువంటి కీర్తి
ఆశించడనీ, పై చెప్పిన వారితో సరిసమానుడని భావము)
ఈ రాయన భాస్కరుడు మహాదాత అని చాలా మంది
చెప్పేవారు. ఇతను వయసులో భీమకవి కన్నా పెద్దవాడు. భీమకవికి తల్లి తరపు బంధువు.
రాయనభాస్కరుడు మరనించిన తర్వాత ఆయన గురించి చెప్పిన చాటువులు
చ సహజకళంకమూర్తులు
కుజాతులు గూఢతరోదయప్రభా
మహితులు
గోత్రవిద్విషదమాత్యులు రాత్రి చరానుకూలధీ
సహితులు
మందవర్తనులు సర్పసమానులు రాజసేవక
గ్రహములు
కాననయ్యె నల రాయనిభాస్కరుఁ డస్తమించినన్.
భావము: భాస్కరుడు అనగా సూర్యుని తేజము లేక అణిగిఉన్న నీచగ్రహాలనేకము ఆకాశము
మీద కనపడినట్లే రాయనభాస్కరుడు మృతినొందగానే అదివరకు ఊరు పేరులేని నిర్భాగ్యులు
కూడా రాజాస్థానమునకు పోయి పెత్తనము చేయడము ఆరంభించారు.
దీనిని బట్టి రాయన భాస్కరుడు గొప్ప రాజులవద్ద మంత్రియై రాజకార్యములను
నిరుపమానముగా నెరవేర్ఛి ఉన్నాడని అతడు పోవడము వలన ఈ లోకమున వెలితి కలిగినదని
ఆధరించు వారు కరువై ఆనాటి వారు ఎంతో బాధ పడినట్లు గ్రహించవలెను.
శ్లో. కృతేయుగే బలిర్దాతా త్రేతాయాం రఘునందనః
ద్వాపరే
సూర్యపుత్రశ్చ కలౌ రాయనభాస్కరః
భావము: కృతయుగంలో దాత
బలి చక్రవర్తి, త్రేతాయుగంలో దాత శ్రీరాముడు, ద్వాపరయుగంలో దాత కర్ణుడు,
కలియుగమందు దాత రాయన మంత్రి భాస్కరుడు.
Ø
భీమకవి రాయనభాస్కరుని పైచెప్పిన పద్యాలు:
రాయన భాస్కరుడు
మహాదాత, ఎన్నోదానధర్మాలను చేసాడు. ఎంతో మందికి అగ్రహారాలను కట్టించాడు. ఎంతో
మందికి వివాహాలను చేయించాడు. అన్నదానము, వస్త్రదానము, గృహదానములనెన్నో చేయించాడు.
ఎన్నో సత్రాలను కట్టించి, ఉచిత అన్నదాన
వసతులను కల్పించాడు. ఈయన చేసిన
దానధర్మాలను వర్ణిస్తూ చెప్పిన
అద్భుతపద్యాలు.
క పసముత్య మొకటి చాలును
గస
వూడ్చిన చింపిరాలు గంపెం డేలా?
రసికుం
డొక్కఁడె చాలును
రసహీనులు
పదువురేల రాయనిబాచా!
ఉ రాజితకీర్తిశాలియగురాయనిబాచ!
భవద్యశంబు ది
క్పూజితమౌచు
మించె సురభూధరభూధరభూధరేంద్ర కాం
తాజసుగోత్రరు
గ్విధు రథాంగరథాంగరథాంగ శేషభా
షాజలజాహితాహితతుషారతుషారతుషారధాములన్
ఉ ఏమనిలింపశాఖి? పనియేమిసురేశ్వర! యీవి
నిన్నుఁ జిం
తామణి
మీఱినాఁడటకదా మన రాయనబాచకోవిద
గ్రామణి;యౌన
యింతటనె కాదుచుమీ విభవంబునందు ని
న్నో
మతియందు నీగురువునో సుకుమారత నీకుమారునో
మ ఆయలక్ష్మీనిధి రాయన
ప్రభునిబాచామాత్యుఁడశ్రాంతమున్
నియతిన్
బ్రాహ్మణపూజసేయు టభివర్ణింపగ శక్యంబె త
త్ప్రియ
గ్రేహంబున హేమపంజరమునన్ బె’ల్లర్చతప్రార్చత
ప్రియమేధా’
యనుచుం బఠించు శుకశారీకిన్నరీద్వంద్వముల్
ఉ అన్నరొ కొండపల్లి సచివాగ్రణి
రాయనమంత్రి పట్టి బా
చన్నజలాన్నసత్ర
మెడపైన పథంబునఁ బెట్టు నెయ్యి రా
జాన్నము
లొప్పుఁబప్పు పదియాఱు తెఱంగులకూరగాయలున్
వెన్నెలగుజ్జుఁబోలుదధి
వేసవికాల మవారితంబుగన్
క ముసలాపెవ్రేలుఁజన్నుల
పసవంటిది
లోభివానిబ్రదుకు ధరిత్రిన్
బిసిబాలవయసువంటిది
రసికునిజీవనము
మంత్రిరాయనిబాచా!
సీ ఫణిరాజు తనశిరోమణు లర్థికిచ్చునో
యనుచు
విష్ణువు క్రింద నణగియుండె
కైలాసకుధరమెక్కడ
నిచ్చునో యని
యుగ్రుఁడక్కడఁ
గావ లుండఁబూనె
తనయందు
మణుల నేతఱి నిచ్చునో యని
వనధిసంతతమును
వణఁకుచుండె
సురధరాధరము
నెవ్వరి కిచ్చునో యని
తరణి
యగ్గిరిచుట్టుఁ దిరుగుచుండె
గీ ఔర! నీదానవిఖ్యాతి యఖిలదిశల
మించివర్తించె
నీకీర్తి నెంచఁదరమె
గాఢదారిద్ర్య
యామినీ కాంతిచంద్ర
భాగ్యదేవేంద్ర!
రాయన భాస్కరేంద్ర!
సీ నీపంక్తినొకనాడు నెఱిభుజించినవిప్రుఁ
డమృతాన్నమైనను
నరుచిసేయు
నీసభాస్థలి
నొక్కనిముసమున్నజనుండు
తల్పశేషునినైనఁదప్పుపట్టు
నీరూపమొకనాడు
తేఱిచూచినభామ
కందర్పునైన
డాకాలఁ దన్ను
నీచేతిదానమ్ము
నెమ్మినమ్మినయర్థి
యెమ్మెధనాధిపుఁ
బొమ్మబెట్టు
గీ నీవె నినుఁ బోలుదువు గాక నిన్ను
నెన్ని
యున్నమంత్రుల
నెన్నుట పిన్నతనమె
బాలికాప్రాణ
నూతన పంచబాణ!
భాస్కరేంద్రుని
రాయనభాస్కరేంద్ర!
క అక్షరాభ్యాసంబు శిక్షచేసెడునాఁడె
యోవ్రాసి
నా వ్రాయకుండినావు
గుణితవేళలయందుఁ గోరి లాకేత్వంబు
దాకుఁ
గొమ్మియ్యక తర్లినావు
ఒకటి
పంక్తినివ్రాయు నూహ నేర్చిన నాడె
సున్నచుట్టక
వ్రేలు చూపినావు
గణితవేళలనాఁడె
ఘనయుక్తిగా నేర్పు
గురుకీర్తికిని
బాలుగూర్చినావు
తే నిజకులాచారధర్మంబు నిర్వహించి
హెచ్చు
గలయట్టిదాతవై హెచ్చినావు
సరసహృదయుండ
వినుకొండ శాసనుండ!
భవ్యభరతుండ!
రాయన భాస్కరుండ!
సీ సంగీత సాహిత్యసరసవిద్యల కిచ్చు
బహురూపులకు
నిచ్చుఁ బట్టు కిచ్చు
పెండ్లి
పేదల కిచ్చుఁ బేదవిప్రులకిచ్చు
బీదసాదుల
కెల్లఁ బిలిచియిచ్చు
తిట్టవచ్చిన
నిచ్చు దీవించఁగా నిచ్చుఁ
గొట్టవచ్చిన
నిచ్చుఁ గొంటె కిచ్చు
బాచన్న!
యననిచ్చు భాస్కరా! యననిచ్చుఁ
దేర
బాచా యన్నఁ దిరిగి యిచ్చు
గీ మెచ్చి తగ నిచ్చు మెచ్చులుమెచ్చి
యిచ్చు
వీడువాఁ
డనకయె సొమ్ము వేడ నిచ్చు
మంత్రిరాయని
భాస్కరామాత్యుఁబోలఁ
గలరె
దాతలు మూడులోకములయందు?
సీ కదలియి ల్వెడలంగఁ గడప కాల్ దాఁకినఁ
దలపాగ
పందిటఁ దగులుకొన్న
ఎందుఁబోయెద
వన్న నేకవిప్రునిఁ గన్న
నొంటిరోదన
మన్న నుండు మన్న
తగినచోఁ
దుమ్మినఁ దంబళియెదురైన
వీడినతలవాని
వీథిఁ గన్న
ఒలిమిడిమిక్కిలి
యొంటికొమ్మెక్కినఁ
బులుఁగువీచినఁబొడపురుగుఁ
గన్న
గీ మాన కేతెంచు నర్థిసమాజములకు
నిచ్చు
నిష్టార్థవస్తువు లెలమితోడ
సరసహృదయుండు
వినుకొండశాసనుండు
భవ్యభరతుండు
రాయనభాస్కరుండు
సీ అతిథికోట్లకు నిల నమృతాన్నసత్రంబు
నంబలిసత్రంబు
నాతురులకు
ఆచార్యులిండ్ల
రామానుజసత్రంబు
నూనెసత్రము
శిరస్స్నానమునకు
బాలకులకును
నేర్పడఁ బాలసత్రము
కామసత్రము
విటగ్రామణులకు
జలకమాడుట
కింట జల సృష్టి సత్రంబు
తాంబూలసత్రంబు
ధన్యులకును
గీ కట్టడలు చేసె వినుకొండ పట్టణమున
సర్వకాలము
సత్కారపూర్వకముగ
మంత్రి
రాయనభాస్కరామాత్యుఁ బోల
గలరె
దాతలు మూడులోకములయందు?
సీ నిత్యసత్యత్యాగనీతిలో శిబిఁ జెప్పి
నినుఁ
జెప్పి మఱియును నినుఁ జెప్పి
బహుపరాక్రమమునఁ
బరశురామునిఁ జెప్పి
నినుఁ
జెప్పి మఱియును నినుఁ జెప్పి
రఘుకులోత్తముఁడైన
రామచంద్రునిఁ జెప్పి
నినుఁ
జెప్పి మఱియును నినుఁ జెప్పి
సుకుమారతను
సరి సురరాజసుతుఁ జెప్పి
నినుఁ
జెప్పి మఱియును నినుఁ జెప్పి
గీ చెప్పఁ దగుఁగాక యితరులఁ జెప్పఁదగునె?
కలియుగంబున
నీవంటిఘనుడు కలడె?
అమితగుణసాంద్ర!
మానినీకుముదచంద్ర!
భాగ్యదేవేంద్ర!
రాయని భాస్కరేంద్ర!
ఉ నన్నుతలీలఁ బాండవులసంతతిఁ గర్ణుఁడు
దాత గాక వా
రన్నలు
దమ్ములందు నొక రైన వదాన్యులు గారు; కీర్తిసం
పన్నునిరాయన
ప్రభుని భాస్కరుసంతతి నెంచి చూడ వా
రన్నలు
దమ్ములింటఁ గలయందఱు దాతలు భూతలమ్మునన్.
సీ ఏవేళఁ జూచిన నిందిరానంద మై
యందమై
చెలఁగు నీమందిరంబు
ఏపాళఁ
జూచిన గోపాలసత్కథా
ళిందమై
చెలఁగు నీ మందిరంబు
ఏజాముఁ
జూచిన నిష్టాన్నభోజనా
ళిందమై
చెలఁగునీమందిరంబు
ఏప్రక్కఁ
జూచిన సుప్రజానాయకా
ళిందమై
చెలఁగు నీమందిరంబు
గీ గాక తక్కినమంత్రివర్గములయిండ్లు
మేకమెడచండ్లు
గిజిగాండ్ల మెఱుగుగూండ్లు
పూవుఁబోఁడులు
నిర్మించుబొమ్మరిండ్లు
భవ్యవిభవేంద్ర!
రాయని భాస్కరేంద్ర!
సీ రంగత్కృపాదృష్టి గంగాభవానికి
మణికంకణంబు
లేమంత్రి యొసఁగె
భిక్షార్థ
మీయఁగా నక్షయంబగునట్లు
మార్తాండుఁ డర్థ మేమంత్రి కొసఁగెఁ
దగ
వేడినంతలో జగతిపై నర్థికి
మానంబుప్రాణ
మేమంత్రి యొసఁగె
మీసంబు
తాకట్టువేసి పదార్థంబు
మహిమచే
నర్థి కేమంత్రి యొసఁగె
గీ అతడు సందవరీకవరాన్వయుండు
దుర్ఘటుండు
వసిష్ఠగోత్రోద్భవుండు
శత్రుమథనుండు
వినుకొండ శాసనుండు
భవ్యభరతుండు
రాయనిభాస్కరుండు.
క వసుధేశుఁ గొల్వరాదో
పసగలమణియంబు
చేసి బ్రదుకఁగరాదో
రససిద్ధిఁ
బడయరాదో
రసికుఁడు
కారాదు గాక రాయన బాచా!
క మీఁగాళ్ల బంటినీళ్లకు
వీఁగుదు
రమ్మక్క యనుచు వెరపున వనితల్
చాఁగి
పయోధులు దాటెను
రాఁగై
నీకీర్తికాంత రాయని బాచా!
సీ ఉత్తుంగ భుజసూనుద త్తనందాపురీ
పుణ్యాగ్రహారాంశభోక్త
యితఁడె
ఆజన్మ
సంసిద్ధభూజన ప్రఖ్యాత
దానసింహాసనాధ్యాసి
యితఁడె
కొండపల్లీరాజ్యమండలాఖిలమహా
గణకసందోహాగ్రగణ్యుఁడితఁడె
వైకుంఠతీర్థనిర్వాణసంయమికృపా
సంవర్ధితాఖిలైశ్వర్యుఁడితడె
గీ కొండవీ డుద్దగిరి పెనుగొండ గుత్తి
పానుగ
ల్విజయనగరపట్టణముల
యర్థులకునిచ్చు
నితడె యిష్టార్థ మనుచు
జగమురాయనభాస్కరుఁ
బ్రెగడఁబొగడు.
ఉ రాజతకీర్తి శాలి యగు రాయనిభాస్కరు
వేఁడబోవఁగా
నాజికి
నిట్లనుల్ బరునియాలికి నిట్లను నర్థికిట్లనుల్
దేజము
పెంపులేని యతిదీనుని హీనుని వేడఁబోవగా
నాజికి నిట్లనున్ బరునియాలికి నిట్లను
నర్థి కిట్లనున్.
ఈ రాయనభాస్కడి మంత్రి
కుమారుడు కొండనామాత్యుడు. ఇతను కూడా భీమకవి పట్ల ఎంతో భక్తిప్రపత్తులతో
మెలిగేవాడు. ఇతను కూడా తన తండ్రిలాగా దానగుణసంపన్నుడు. ఇతని మీద భీమకవి చెప్పిన
అద్భుత చాటువులు.
శా కాండావిర్భవ భాండభూపరి వృఢగ్రైవేయ
శైలేయసూ
కాండా
టాధిప కేతుమాతుల బలాకాశ స్రవంతీ మరు
త్కాండా
ఖండలతుండి పాండురయశః కర్పూర పేటీభవ
త్కాండా!
రాయనమంత్రి భాస్కరుని కొండా! దండనాధాగ్రణీ!
శా రెండానాల్కలు సాంప్రదాయకునికిన్ లెక్కింపగా నొక్కటే
గండాగొండి
శిఖండిబండనికి లెక్కల్లేని నాల్కల్ కదా
చండా రాతికులాట వీదహన తేజస్ఫార
ధాటీల స
త్కాండా!
రాయనమంత్రి భాస్కరుని కొండా! దండనాధాగ్రణీ
క పద్యము చెప్పిన సుకవికి
హృద్యముగా నొసఁగనట్టి హీనాత్మునియా
పద్యము
పామైకఱచును
ప్రద్యోదిత
కీర్తికాండా! భాస్కరుకొండా!
ఆవె పడుచునిడిన వానిఁ బద్యమిచ్చిన వానిఁ
గడువుకిడినవాని
నడుపవలయు
నడుపలేనివాని
నయవిదులెంతురా
భువిని
భాస్కరేంద్ర పుత్ర! కొండా!
No comments:
Post a Comment